యూఎస్ ఓపెన్ ఛాంపియన్, జపాన్ స్టార్ ప్లేయర్ నవోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ఆగస్టులో న్యూయార్క్ వేదికగా జరిగిన వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్లో గాయపడిన ఈమె... టోర్నీ ఫైనల్ నుంచి వైదొలిగింది. కాలు నొప్పి ఇంకా తగ్గకపోవడం వల్ల ఫ్రెంచ్ ఓపెన్కూ దూరమవుతున్నట్లు తెలిపింది. పారిస్లో సెప్టెంబరు 27న ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
- — NaomiOsaka大坂なおみ (@naomiosaka) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) September 18, 2020
">— NaomiOsaka大坂なおみ (@naomiosaka) September 18, 2020
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటం వల్ల స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్యపై పరిమితులు విధించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. గతంలో రోజుకు 11వేల మందికిపైగా అనుమతించాలని ప్రణాళిక వేశారు. కానీ పారిస్ పోలీసు శాఖ నిబంధనల ప్రకారం రోజుకు 5వేల మంది మాత్రమే ప్రత్యక్షంగా టోర్నీ వీక్షించే అవకాశముందని తెలిపారు.