ETV Bharat / sports

Novak Djokovic: అలా చేయకపోతే జకోవిచ్‌ ఇంటికే..! - నోవాక్​ జకోవిచ్​ వ్యాక్సిన్​

Novak Djokovic: ప్రపంచ నంబర్​వన్​ ఆటగాడు జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొననున్నాడనే విషయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జకో.. తన వ్యాక్సినేషన్​ స్టేటస్​ను ఇంత వరకు ప్రకటించకపోవడమే. దీనిపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ కూడా స్పందించారు. సరైన కారణాలు చూపితేనే టోర్నీలో ఆడనిస్తామని స్పష్టం చేశారు.

djokovic
జకోవిచ్‌
author img

By

Published : Jan 5, 2022, 10:47 PM IST

Updated : Jan 6, 2022, 5:31 AM IST

Novak Djokovic: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ సరైన కారణం చూపితేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడతారని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ వెల్లడించారు. జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొననున్నారనే విషయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ టోర్నిలో పాల్గొనేవారు కచ్చితంగా టీకా తీసుకోవడం కానీ, నిపుణుల కమిటీని సంప్రదించి మినహాయింపు పొందడంగానీ చేయాలి. కానీ, తన వ్యాక్సినేషన్‌స్థితిపై ఇప్పటి వరకు జకోవిచ్‌ స్పందించలేదు. గతేడాది మాత్రం వ్యాక్సిన్‌కు వ్యతిరేకమని ప్రకటించారు. తాజాగా వస్తున్న వ్యతిరేకతపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అధికారులు స్పందించారు. జకోవిచ్‌కు ఎటువంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌లు చవిచూసినా.. రోజువారీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 ఏళ్లు దాటిన వారిలో 90శాతం మందికి పూర్తిస్థాయిలో టీకాలు అందాయి. కానీ, చాలా మంది ఆస్ట్రేలియన్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లడంలేదు. జకోవిచ్‌ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందిస్తూ.. 'జకోవిచ్‌ వ్యాక్సిన్‌ నుంచి మినహాయింపు పొందడానికి సరైన కారణం చూపితేనే టోర్నిలో ఆడతారు.. లేకపోతే తర్వాతి విమానంలోనే ఇంటికి పోతారు' అని వ్యాఖ్యానించారు. అతని కోసం ప్రత్యేక నిబంధనలు ఏవీ లేవని కుండబద్దలు కొట్టారు.

ఇదీ చూడండి: 'కొంచెం బాధ్యతగా ఆడాలి'.. పంత్​కు గావస్కర్ చురకలు

Last Updated : Jan 6, 2022, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.