వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది మాజీ ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నవోమి ఒసాకా. జాతివివక్షకు నిరసనగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఓ నల్లజాతీయుడైన జాకబ్ బ్లేక్పై జరిపిన కాల్పుల గురించి తెలుసుకున్న తర్వాత తాను తీవ్ర ఆవేదనకు లోనయినట్లు ట్వీట్లో పేర్కొంది.
- — NaomiOsaka大坂なおみ (@naomiosaka) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) August 27, 2020
">— NaomiOsaka大坂なおみ (@naomiosaka) August 27, 2020
"హలో, మీలో చాలా మందికి నేను తెలుసు. రేపు జరగనున్న వెస్టర్న్ అండ్ సదరన్ సెమీఫైనల్స్‌లో ఆడాల్సిఉంది. అయితే టెన్నిస్ ప్లేయర్ కంటే ముందు నేను నల్లజాతి మహిళను. ప్రస్తుతం నేను టెన్నిస్ ఆడటం కంటే జాతివివక్ష నిరసనలకు మద్దతుగా నిలవడం అవసరం అనిపిస్తుంది. నేను ఆడకపోతే ఏదో కోల్పోతానని అనుకోవడం లేదు. పోలీసుల చేతిలో నల్లజాతీయులు హతమవ్వడం చూసి కడుపు తరుక్కుపోతుంది. ఈ సమస్యల గురించి ప్రతిరోజూ మాట్లాడి విసిగిపోయా."
-నవోమి ఒసాకా, ప్రపంచ మాజీ టెన్నిస్ నంబర్ వన్
నవోమి ఒసాకా.. ప్రస్తుతం జరుగుతున్న వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ సెమీఫైనల్లో ఎలిస్ మెర్టెన్స్తో తలపడాల్సి ఉంది.
ఎన్బీఏ మ్యాచ్‌లూ వాయిదా
అలాగే మిల్వాకీ బక్స్ జట్టు బాస్కెట్‌బాల్ ప్లేఆఫ్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న తర్వాత.. మూడు మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ). బక్స్ వర్సెస్ మ్యాజిక్, హ్యూస్టన్ రాకెట్స్ వర్సెస్ ఓక్లహోమా సిటీ థండర్, లాస్ ఏంజిల్స్ లేకర్స్ వర్సెస్ పోర్ట్ ల్యాండ్ టైల్ బ్లేజర్స్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.