ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో నాదల్, ​యాష్​ బార్టీ - ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో నాదల్

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో స్టార్​ ప్లేయర్స్​ రఫెల్​ నాదల్​, మెద్వేదేవ్​, యాష్​ బార్టీ, జెస్సికా పెగులా క్వార్టర్స్​కు అర్హత సాధించారు.

nadal
నాదల్​
author img

By

Published : Feb 15, 2021, 7:04 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో పలువురు స్టార్ ఆటగాళ్లు క్వార్టర్​ఫైనల్స్​లోకి అడుగుపెట్టారు. వారెవరంటే..

  • స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్​లో దూసుకెళ్తున్నాడు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ ఫాబియో ఫొగిని(ఇటలీ)పై విజయం సాధించాడు. వరుస సెట్లలో 6-3,6-4,6-2 తేడాతో ఓడించాడు. ఫలితంగా క్వార్టర్స్​ఫైనల్స్​లో అడుగుపెట్టాడు. క్వార్టర్​ఫైనల్స్​లో ఐదో సీడెడ్​ ప్లేయర్​​ స్టెఫానోస్ సిట్సిపాస్​తో తలపడనున్నాడు.
  • మెద్వేదేవ్​(రష్యా)6-4,6-2,6-3 తేడాతో మెక్​డొనాల్డ్​ను ఓడించి క్వార్టర్​ఫైన్​లోకి అడుగుపెట్టాడు. ఈ పోరు 90నిమిషాల పాటు సాగింది.
  • మహిళల సింగిల్స్​లో ఆస్ట్రేలియా ప్లేయర్, ప్రపంచ నం.1 ర్యాంకర్​​ యాష్​ బార్టీ క్వార్టర్​కు అర్హత సాధించింది. ప్రీక్వార్టర్స్​లో షెల్బీ రోగర్స్​(అమెరికా)పై 6-3,6-4 తేడాతో గెలిచింది. క్వార్టర్​ఫైనల్​లో ప్రపంచ నం.25 కరోలినా ముచోవాతో తలపడనుంది.
  • జెస్సికా పెగులా(అమెరికా) ఉక్రెయిన్​కు చెందిన ఐదో సీడ్​ ఎలీనా స్విటోలినాపై 6-4,3-6,6-3 తేడాతో నెగ్గి ముందుకు సాగింది.

అంతకుముందు ఈ క్వార్టర్స్​లోకి పురుషుల సింగిల్స్​ నుంచి జకోవిక్​, మహిళల సింగిల్స్​ నుంచి సెరెనా ప్రవేశించారు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో జకోవిచ్​, సెరెనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.