స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్.. వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంతో కాలెండర్ ఇయర్‌ను ముగించాడు. తాజాగా ఏటీపీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాడు.
ఇటీవలే జరిగిన 'ఏటీపీ ఫైనల్స్'లో గ్రూప్ స్టేజ్ దాటని నాదల్కు జకోవిచ్ వైఫల్యం కలిసొచ్చింది. ఫలితంగా 9,985 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు. ఫెదరర్, జకోవిచ్ సరసన నిలిచాడు. మాజీ టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ ఆరుసార్లు ఈ ఘనత సాధించి, వీరికంటే ముందున్నాడు.
ఈ ఏడాది.. నాదల్(ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్), జకోవిచ్(ఆస్ట్రేలియా, వింబుల్డన్ ఓపెన్) చెరో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచారు.
టెన్నిస్ స్టార్ ఫెదరర్.. ఈ ఏడాది ఒక్క గ్రాండ్ స్లామ్ గెలవలేకపోయాడు. ఫలితంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
ర్యాంక్‌ల వారిగా జాబితా
1 రఫెల్ నాదల్ (స్పెయిన్) 9,985
2 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 9,145
3 రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6,590
4 డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 5,825
5 మెద్వదేవ్ (రష్యా) 5,705
ఇవీ చూడండి.. 'సవ్యసాచి' బౌలింగ్‌కు నెటిజన్ల ఫిదా!