ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను 10వ సారి కైసవం చేసుకున్నాడు ప్రపంచ నెంబర్ 3 ఆటగాడు, స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్. ఫైనల్లో నెంబర్ వన్ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి టైటిల్ గెలిచాడు. ఇద్దరి మధ్యా హోరాహోరీ జరిగిన ఈ పోరులో రఫా 7-5, 1-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. దాదాపు 2 గంటల 50 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ఈ విజయం ద్వారా 36వ ఏటీపీ-1000 టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న నాదల్.. జకోవిచ్‌ను సమం చేశాడు.
స్వైటెక్ జోరు
మహిళల విభాగంలో టైటిల్‌ను దక్కించుకుంది పొలాండ్‌కు చెందిన ఇగా స్వైటెక్. ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాను 6-0, 6-0 తేడాతో చిత్తుచేసింది. కెరీర్లో స్వైటెక్‌కు ఇది మూడో టైటిల్. 19 ఏళ్ల ఈ క్రీడాకారిణి రెండు వారాల్లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగబోతుంది.