కొన్ని రోజులుగా కనిపించకుండాపోయిన చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి (Peng Shuai Missing) మళ్లీ అభిమానుల ఎదుట ప్రత్యక్షమైంది. ఆదివారం ఆమె ఉన్న ఒక వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. బీజింగ్‌లో జరుగుతున్న యూత్ టోర్నీకి పెంగ్ ఆతిథిగా హాజరైనట్లు నిర్వాహకులు వీడియోతో పాటు ఫొటోలు కూడా విడుదల చేశారు. చిన్నారులకు టెన్నిస్ బంతులపై సంతకాలు చేస్తూ, అభిమానులకు అభివాదం చేస్తున్నట్లు పెంగ్ ఆ వీడియోలో కనిపించింది.
అధికార పార్టీకి చెందిన మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి జాంగ్ తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల పెంగ్ (Peng Shuai Accusation) ఆరోపించింది. ఆ తర్వాత ఆమె కనబడకుండా పోవడం (Where is Peng Shuai) కలకలం రేపింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఆమె ఆరోపించినట్లుగా సమాచారం ఉన్న వార్తలను వెబ్‌సైట్ల నుంచి తొలగించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
షువాయ్ క్షేమంగా ఉందని భరోసా ఇవ్వని పక్షంలో చైనాలో జరగబోయే టెన్నిస్ ఈవెంట్లను రద్దు చేస్తామని మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్ హెచ్చరించింది. మరో రెండున్నర నెలల్లో ఇక్కడ జరగాల్సిన శీతాకాల ఒలింపిక్స్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పెంగ్ ఆమె ఇంట్లోనే స్వేచ్ఛగా ఉందని.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోరుకుంటుందని (Peng Shuai Latest Video) అధికార పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
నేను క్షేమంగా ఉన్నా!
పెంగ్ షువాయి.. క్షేమంగా సురక్షితంగా, సురక్షితంగా ఉన్నట్లు ఒలింపిక్ అధికారులు చెప్పిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. యూత్ టోర్నీలో ప్రత్యక్షమైన అనంతరం బీజింగ్ నుంచి వీడియో కాల్లో వారితో మాట్లాడిందని తెలిపింది. నవంబర్ 2 నుంచి కనిపించకుండాపోయిన తర్వాత చైనా వెలుపల క్రీడా అధికారులతో పెంగ్ నేరుగా కాంటాక్ట్ అవడం ఇదే తొలిసారి!
ఇదీ చూడండి: Peng Shuai Missing: "పెంగ్ షువాయికి ఏమైంది?.. ఆమె ఆచూకీ ఎక్కడ?"