ETV Bharat / sports

నాదల్​ను వెనక్కు నెట్టి.. రెండో స్థానానికి మెద్వెదెవ్ - నొవాక జకోవిచ్

రష్యా స్టార్​ టెన్నిస్ ఆటగాడు డేనియల్​ మెద్వెదెవ్​.. ఏటీపీ ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి చేరుకున్నాడు. స్పెయిన్​ ప్లేయర్​ రాఫెల్​ నాదల్​ మూడో స్థానానికి పడిపోయాడు. జకోవిచ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

Medvedev pushes Nadal to No. 3 in ATP rankings
డేనియల్ మెద్వెదెవ్, రష్యా టెన్నిస్ ప్లేయర్
author img

By

Published : May 11, 2021, 2:44 PM IST

టెన్నిస్​ ఏటీపీ ర్యాంకింగ్స్​లో రష్యా స్టార్​ ప్లేయర్​ డేనియల్​ మెద్వెదెవ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆ స్థానంలో ఉన్న స్పెయిన్​ ఆటగాడు రాఫెల్ నాదల్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. సెర్బియా టెన్నిస్​ ఆటగాడు నొవాక్ జకోవిచ్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇటలీ రోమ్ ఓపెన్​ మాస్టర్స్​ 1000 టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తే.. నాదల్​కు తిరిగి రెండో ర్యాంకును కైవసం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే వారం ఏటీపీ 250 టోర్నీలోనూ ఆడనున్నాడు నాదల్​.

ఇటీవల ముగిసిన మాడ్రిడ్ ఓపెన్​లో మెద్వెదెవ్​, నాదల్.. ఇద్దరూ సెమీస్​ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. మెద్వెదెవ్​.. క్రిస్టియన్​ గారిన్​ చేతిలో ఓడిపోగా.. అలెగ్జాండర్​ జ్వరెవ్​ చేతిలో నాదల్​ పరాజయం పాలయ్యాడు.

ఇదీ చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీకి మరోసారి కొవిడ్​ పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.