ETV Bharat / sports

భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్​ అలీ కన్నుమూత - former devis cup coach

భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, డేవిస్​ కప్​ మాజీ కోచ్​ అక్తర్ అలీ మృతి చెందారు. క్యాన్సర్​ సహా పలు అనారోగ్య సమస్యలతో రెండు వారాల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.

Legendary Davis Cup coach Akhtar Ali dies
భారత టెన్నిస్ దిగ్గజం అక్తర్​ అలీ మృతి
author img

By

Published : Feb 7, 2021, 12:55 PM IST

భారత టెన్నిస్​ దిగ్గజం, డేవిస్​ కప్​ మాజీ కోచ్​ అక్తర్​ అలీ(83) కన్నుమూశారు. ప్రొస్టేట్​ క్యాన్సర్ సహా పలు అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. పార్కిన్సన్​ వ్యాధితో బాధపడుతున్న అక్తర్​ అలీని.. రెండు వారాల క్రితం కోల్​కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుత డేవిస్​ కప్​ కోచ్​ జీషన్​ అలీ ఈయన కుమారుడే.

జీషన్​ అలీ, విజయ్​ అమృత్​రాజ్​, రమేశ్​ కృష్ణన్​ సహా చాలా మంది ఈ దిగ్గజ టెన్నిస్​ దిగ్గజ్​ కోచింగ్​ వల్ల ప్రభావితమయ్యారు.

"అక్తర్​ అలీ అద్భుతమైన కోచ్​. భారత టెన్నిస్​కు గొప్ప సేవలందించారు. ప్రియమైన అక్తర్​కు నివాళులు. జీషన్​, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అంటూ విజయ్ అమృత్​రాజ్​ ట్వీట్​ చేశారు.

మమత సంతాపం..

అలీ మృతి పట్ల బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంట సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి: తొలి టెస్టు: లంచ్​ విరామానికి భారత్​ స్కోరు 59/2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.