ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్: ఫైనల్లోకి జకో.. రఫాతో అమీతుమీ - నొవాక్ జకోవిచ్

ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లోకి సెర్బియా టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ దూసుకెళ్లాడు. సెమీస్​లో లోరెంజో సోనెగోపై 6-3, 5-7 (2), 6-2తో గెలుపొందాడు జకో. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్​లో నాదల్​తో తలపడనున్నాడు జకోవిచ్​. ​

Novak Djokovic, Italian Open 2021
నొవాక్ జకోవిచ్, సెర్బియా టెన్నిస్ ఆటగాడు
author img

By

Published : May 16, 2021, 8:13 AM IST

సెర్బియా స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ నొవాక్​ జకోవిచ్​.. ఇటాలియన్​ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు లోరెంజో సోనెగోపై 6-3, 5-7 (2), 6-2 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్​లో ఊపుమీద కనిపించిన లోకల్​ హీరో సోనెగో.. తర్వాత జకోవిచ్​ ధాటికి నిలువలేకపోయాడు. సొంత గడ్డపై టైటిల్ సాధించాలన్న కల నెరవేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు సోనెగో.

ఆసక్తికరంగా ఫైనల్..

ఇప్పటికే ఫైనల్​ చేరిన రఫెల్​ నాదల్​తో తుది పోరులో తలపడనున్నాడు జకోవిచ్. 11 సార్లు ఇటాలియన్ ఓపెన్ గెలిచి ఊపుమీదున్న నాదల్​ వచ్చే నెల ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు 5 సార్లు ఇటాలియన్​ టైటిల్​ను కైవసం చేసుకున్న జకోవిచ్​ కూడా ఎర్రమట్టి కోర్టుపై తుది సమరానికి సిద్ధమయ్యాడు.

ఈ ఇద్దరు స్టార్​ ఆటగాళ్ల మధ్య ఆదివారం ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు 57 సార్లు వీరిద్దరు ముఖాముఖి పోటీపడ్డారు. ఏదేమైనా ఎర్రమట్టి కోర్టుపై నాదల్​దే పైచేయి అనడంలో సందేహమే లేదు!

ఇదీ చదవండి: ఇటాలియన్​ ఓపెన్​ ఫైనల్లోకి రఫా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.