ETV Bharat / sports

ఏటీపీ ఫైనల్స్​: నాదల్​ను ఓడించిన డొమినిక్​ థీమ్​

టెన్నిస్​ దిగ్గజం రఫెల్​ నాదల్​కు ఏటీపీ ఫైనల్స్​లో చుక్కెదురైంది. రెండో రౌండ్​లో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్​ థీమ్​పై రఫెల్​ పరాజయాన్ని చవిచూశాడు.

Inspired Dominic Thiem outshines Rafael Nadal at ATP Finals
ఏటీపీ ఫైనల్స్​: నాదల్​ను ఓడించిన డొమినిక్​ థీమ్​
author img

By

Published : Nov 18, 2020, 7:39 AM IST

ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌కు చుక్కెదురైంది. గ్రూప్‌ తొలి మ్యాచ్‌ గెలిచి ఉత్సాహంగా ఉన్న రఫాకు.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రియా కుర్రాడు డొమినిక్‌ థీమ్‌ ఓటమి రుచి చూపించాడు. మంగళవారం జరిగిన పోరులో థీమ్‌ 7-6 (9/7), 7-6 (7/4)తో నాదల్‌ను ఓడించాడు. హోరాహోరీ సాగిన ఈ పోరులో రెండు సెట్లను థీమ్‌ టైబ్రేకర్‌లోనే గెలిచాడు. మరోవైపు రష్యా యువ కెరటం డానియల్‌ మెద్వెదెవ్‌ శుభారంభం చేశాడు. అయితే అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై 6-3, 6-4తో గెలిచే క్రమంలో అతను అండర్‌ ఆర్మ్‌ సర్వీస్‌తో ప్రత్యర్థినే కాదు అభిమానులనూ ఆశ్చర్యపరిచాడు.

ఈ మ్యాచ్​లో ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన జ్వెరెవ్​ ఆ తర్వాత తడబడ్డాడు. ఆరో గేమ్​లో ప్రత్యర్థి సర్వీస్​ బ్రేక్​ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన మెద్వెదెవ్​.. అదే జోరులో 6-4తో సెట్​ గెలుచుకున్నాడు. అతను ఓ మెరుపు ఏస్​తో ఈ సెట్​ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో 4-3, 30-30తో ఉన్న సమయంలో నెట్​ దగ్గర బంతి పడేలా మెద్వెదెవ్​ అండర్​ ఆర్మ్​ సర్వీస్​ చేశాడు. అయితే బేస్​లైన్​ సమీపంలో ఉన్న జ్వెరెవ్​ నెట్​ దగ్గరకు పరుగెత్తుతూ వచ్చి రిటర్న్​ చేసినా.. ఆ తర్వాత మరో రిటర్న్​ను అతను సరిగా ఆడలేకపోవడం వల్ల పాయింట్​ డానియల్​ సొంతమైంది. అక్కడ నుంచి మరింత విజృంభించి ఆడిన ఈ రష్యా కెరటం 6-4తో సెట్​తో పాటు మ్యాచ్​ను గెలుచుకున్నాడు. ఏటీపీ ఫైనల్స్​ టోర్నీలో అతనికిదే తొలి విజయం. గతేడాది టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ మెద్వెదెవ్​ ఓడిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.