ETV Bharat / sports

సెమీఫైనల్లో టెన్నిస్​ యువ కెరటం రామ్​కుమార్​ - ఎకెన్‌టాల్‌ ఛాలెంజర్‌ టోర్నీ

ప్రతిష్ఠాత్మక ఎకెన్​టాల్​ ఛాలెంజర్​ టోర్నీలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టాడు భారత యువ టెన్నిస్​ ఆటగాడు రామ్​ కుమార్​ రామనాథన్‌​. రష్యా ఆటగాడిని క్వార్టర్​ ఫైనల్లో ఓడించి దూసుకెళ్లాడు.

indian tennis player ram kumar ramnathan entered into semi finals of eckental chellengers touny
సెమీఫైనల్లో టెన్నిస్​ యువ కెరటం రామ్​కుమార్​
author img

By

Published : Nov 7, 2020, 8:13 AM IST

భారత యువ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోరు మీదున్నాడు. అతను ఎకెన్‌టాల్‌ ఛాలెంజర్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్‌ రామ్‌కుమార్‌ 6-2, 6-1తో నాలుగో సీడ్‌ డోన్స్‌కొయ్‌ (రష్యా)ను చిత్తు చేశాడు.

ఈ పోరులో 11 ఏస్‌లు సంధించిన రామ్‌.. నెట్‌ గేమ్‌తో అదరగొట్టి 57 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించాడు.

ఇదీ చూడండి:పారిస్​ మాస్టర్స్​ క్వార్టర్స్​లో బోపన్న జోడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.