ETV Bharat / sports

ఒలింపిక్స్​ రికార్డు పోయినా.. గ్రాండ్‌స్లామ్‌ల శతకం కొడతా!

దేశంలో టెన్నిస్‌ పేరెత్తగానే ముందుగా గుర్తొచ్చేది.. లియాండర్‌ పేస్‌. 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. 18 గ్రాండ్‌స్లామ్‌లు.. ఒలింపిక్స్‌ టెన్నిస్‌  సింగిల్స్‌లో పతకం గెలిచిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు. ఇలా ఎన్నో ఘనతలు అతడి సొంతం.  ఇప్పటివరకూ 97 గ్రాండ్‌స్లామ్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన పేస్‌ శతక స్లామ్‌ దిశగా సాగుతున్నాడు. ఓ షోలో మాట్లాడిన ఈ వెటరన్‌ దిగ్గజం తన కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నాడు..    ఆ విశేషాలు అతని మాటల్లోనే..

leander paes news
సిడ్నీలో భారత జెండాతో నడవడం.. జీవితంలో ది మొమరబుల్​
author img

By

Published : Jun 6, 2020, 7:26 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో తిరిగి క్రీడలు మొదలవుతున్నా.. పూర్తిస్థాయిలో ఆటల నిర్వహణ ఎప్పుడు సాధ్యమవుతుందో చెప్పలేం. టెన్నిస్‌ది కూడా అదే పరిస్థితి. యుఎస్‌ ఓపెన్‌ నిర్వహణపై వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా దానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకూ 97 గ్రాండ్‌స్లామ్‌లు ఆడా. ఇంకో మూడు టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించి శతకం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మరో ఒలింపిక్స్‌ ఆడి ఎనిమిదిసార్లు ఈ మెగా టోర్నీలో ఆడిన తొలి టెన్నిస్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించాలి. ఈ ఏడాదే టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వీలుంది. ఒలింపిక్స్‌కు వెళ్లకపోయినా.. ఇప్పటివరకూ నా కెరీర్‌ పట్ల సంతృప్తితో ఉన్నా.

.

Leander Paes
లియాండర్​ పేస్​

అమ్మానాన్న వల్లే ఆటవైపు..

నేను ఆటలవైపు రావడానికి ప్రధాన కారణం మా అమ్మానాన్న. నాన్నేమో 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జాతీయ హాకీ జట్టులో సభ్యుడు. అమ్మ.. 1980 ఆసియా బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును నడిపించింది. దాంతో నన్ను కూడా క్రీడాకారుడిగా చూడాలని వాళ్లు భావించారు. వాళ్ల ఒత్తిడితోనే నేను ఈ వైపు వచ్చా. చిన్నతనంలో ఫుట్‌బాల్‌, క్రికెట్‌, హాకీ, అథ్లెటిక్స్‌.. ఇలా అన్నీ ఆడేవాణ్ని. నా తొలి ప్రేమ మాత్రం ఫుట్‌బాలే. కానీ కోల్‌కతా నుంచి చెన్నైకి మారాక టెన్నిస్‌పై దృష్టి పెట్టా. జూనియర్‌ స్థాయిలో.. యుఎస్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లు గెలిచా. ప్రపంచ నంబర్‌వన్‌గానూ నిలిచా. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

Leander Paes
కుటుంబంతో లియాండర్​ పేస్​

ఒలింపిక్స్‌ పతకం..

1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌లో ఓడిపోయా. దాంతో సింగిల్స్‌పై దృష్టి పెట్టా. దాని కోసం నాలుగేళ్లు కష్టపడ్డా. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌కు రెండు నెలల ముందు ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవడం కోసం విదేశాలకు వెళ్లా. సింగిల్స్‌ బరిలో దిగి కాంస్యం సాధించా. ఆ పతకం గెలిచినందుకు ఇప్పటికీ ఎంతో గర్వంగా ఉంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి దేశ క్రీడా బృందాన్ని నడిపించడం జీవితకాల అనుభవం.

leander paes news
పతకంతో లియాండర్​ పేస్​

రాకెట్‌ విసిరేశా..

పరిస్థితులు ఎంత కఠినంగా మారినా నువ్వు నీలాగే ఉండడం ఎంతో ముఖ్యం. నేను 1990లో ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఓడిపోయా. కానీ అదే 1991లో పది నెలల పాటు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయా. దాంతో తీవ్ర నిరాశలో మునిగిపోయా. టెన్నిస్‌ ఆడగలనా? నా వల్ల అవుతుందా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ సమయంలో టోర్నీలు ఆడేందుకు డబ్బులు కూడా లేకుండా పోయాయి. ఓ విదేశీ టోర్నీ కోసం వెళ్లి లాకర్‌ గదిలో పడుకోవాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత రాకెట్లను విసిరేసి ఇక టెన్నిస్‌ ఆడనని చెప్పేశా. కానీ తల్లిదండ్రులు నా మనసు మార్చేశారు. నా గమ్యాన్ని కళ్లకు కట్టారు. ఆ తర్వాత అయిదేళ్లకు ఒలింపిక్స్‌ పతకాన్ని అందుకున్నా. అథ్లెట్లకు మానసిక ఆరోగ్యం చాలా ప్రధానమైంది. భారత టెన్నిస్‌ ఎంతో దూరం ప్రయాణించింది. గత 30 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రయాణంలో నా పాత్ర ఉండడం సంతోషకరం.

Leander Paes Aims For 100 Grand Slam
పేస్​ 15వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​

కెరీర్​లో మొత్తం 54 టైటిల్స్​ గెలిచాడు. ఇందులో 18 గ్రాండ్​స్లామ్ డబుల్స్​ ట్రోఫీలు ఉన్నాయి. డెవిస్​కప్​లో అత్యధిక డబుల్స్ టైటిల్స్(44) నెగ్గిన క్రీడాకారుడిగా పేస్​ చరిత్ర సృష్టించాడు.

ఇదీ చూడండి: పురుష క్రికెటర్లకే సవాల్​ విసిరే రికార్డులు వీరి సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.