మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా పోలండ్ టెన్నిస్ ప్లేయర్ హుబెర్ట్ హుర్కాజ్ నిలిచాడు. ఫైనల్లో ఇటలీ సంచలనం జన్నిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు. తొలి మాస్టర్స్ ఏటీపీ టైటిల్ పొందిన పోలండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి: రనౌట్ కోసం డికాక్ ట్రిక్- మాజీల ఆగ్రహం
ఆదివారం జరిగిన తుది పోరులో ఇటలీ ప్లేయర్‌పై 7-6(4), 6-4 తేడాతో గెలుపొందాడు హుబెర్ట్. ప్రస్తుతం 37వ ర్యాంకులో కొనసాగుతున్న ఈ పోలండ్ స్టార్.. వచ్చే వారం ర్యాంకింగ్స్‌లో 16వ స్థానానికి చేరనున్నాడు. దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, డొమినిక్ థీమ్ లేకుండా జరిగిన టోర్నీ ఇది.
ఇదీ చదవండి: భారత తొలి మహిళా వ్యాఖ్యాత కన్నుమూత