గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైత్ర స్వచ్ఛంద సంస్థ పని చేస్తోందని జాతీయ బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో... జాతీయ,అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు చెక్కులు అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఆర్థిక స్తోమత లేక క్రీడలకు దూరం అవుతున్నారని.. వారికి చేయూతనందిచాలనే ఈ సంస్థను స్థాపించామని గోపీచంద్ అన్నారు. దీని ద్వారా గత రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు.
గోపీచంద్, మైత్ర స్వచ్ఛంద సంస్థ తమకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తుందని పతకాలు సాధించిన క్రీడాకారులు పేర్కొన్నారు. కోచ్ రమేష్ శిక్షణలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.