ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​ : నాదల్​తో జకోవిచ్​ 'సై'

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం స్పెయిన్‌ గ్రేట్‌ రఫెల్‌ నాదల్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తలపడనున్నారు. అర్జెంటీనా కుర్రాడు ష్వార్జ్‌మన్‌ను ఓడించి 13వ సారి రొలాండ్‌ గారోస్‌లో రఫా ఫైనల్‌ చేరగా.. హోరాహోరీ పోరులో గ్రీకు ఆటగాడు సిట్సిపాస్‌ పోరాటానికి తెరదించుతూ జకో తుది సమరానికి దూసుకెళ్లాడు. ఆదివారమే ఈ దిగ్గజాల మధ్య టైటిల్​ పోరు జరగనుంది.

Djokovic, Nadal to Meet in Final
నాదల్​తో జకోవిచ్​ సై
author img

By

Published : Oct 10, 2020, 6:52 AM IST

రఫెల్‌ నాదల్‌ మరోసారి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్‌ టైటిల్‌ కోసం తలపడబోతున్నాడు. సాధికారిక ప్రదర్శనతో అతను రొలాండ్‌ గారోస్‌లో ఫైనల్లో అడుగుపెట్టాడు.

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6-3, 6-3, 7-6 (7-0)తో 12వ సీడ్‌ డిగో ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ పోరులో మూడో సెట్లో మినహా పెద్దగా ప్రతిఘటన లేదు. మూడో సెట్లో ష్వార్జ్‌మన్‌ పుంజుకుని సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లినా.. రఫా తగ్గకుండా ఆడి 7-0తో టైబ్రేక్‌ను అలాగే సెట్‌ను, మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

చెలరేగిన జకో..

మరో సెమీస్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ను అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ బాగానే ప్రతిఘటించాడు. చివరికి జకో 6-3, 6-2, 5-7, 4-6, 6-1తో సిట్సిపాస్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లు సులువుగానే గెలిచిన నొవాక్‌కు మూడో సెట్లో దీటుగా బదులిచ్చాడు సిట్సిపాస్‌.

ఒక దశలో 5-4 ఆధిక్యంలో నిలిచిన నొవాక్‌.. వరుసగా మూడో సెట్‌ విజయంతో మ్యాచ్‌ గెలిచేసినట్లే అనుకున్నారు అభిమానులు. కానీ అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్‌.. సెట్‌ గెలిచి జకోవిచ్‌కు షాకిచ్చాడు. నాలుగో సెట్లో ఇద్దరూ హోరాహోరీగానే తలపడ్డా చివరికి సిట్సిపాస్‌దే పైచేయి అయింది.

నిర్ణయాత్మక చివరి సెట్లో హోరాహోరీ తప్పదనుకుంటే.. జకోవిచ్‌ చెలరేగిపోయి సెట్‌ను ఏకపక్షం చేసేశాడు. మూడో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన అతను.. 5, 7 గేమ్‌ల్లో బ్రేక్‌లతో అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో ఆదివారం జరగనున్న తుదిపోరులో నాదల్​, జకోవిచ్​ తలపడనున్నారు.

ఇదీ చూడండి బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.