ఫ్రెంచ్ ఓపెన్ నుంచి భారత్కు చెందిన దివిజ్ శరణ్ నిష్క్రమించాడు. పారిస్ వేదికగా జరిగిన పురుషుల డబుల్స్ ఓపెనింగ్ రౌండ్లో ఓడిపోవడం వల్ల.. దివిజ్తో పాటు, అతడి భాగస్వామి క్వాన్ సూన్వూ(దక్షిణకొరియా)లు వైదొలగాల్సి వచ్చింది.
![Divij](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rohan-bopanna-unplugged-his-first-ever-grand-slam-win-the-support-of-his-wife-and-the-two-day-party_0110newsroom_1601528834_88.jpg)
16వ సీడ్ క్రొయేషియన్- ఆమెరికన్ జంట ఫ్రాంకో స్కుగోర్, ఆస్టిన్ క్రాజిసెక్ చేతిలో 2-6,6-4,4-6 తేడాతో శరణ్, క్వాన్ సూన్ చిత్తుగా ఓడారు. ఫ్రెంచ్ ఓపెన్లో భారత్ తరఫున రోహన్ బోపన్న మాత్రమే ఇంకా ఆడుతున్నాడు. గురువారం జరిగే మ్యాచ్లో డెనిస్ షాపోవాలోవ్(కెనడా)తో కలిసి బరిలోకి దిగనున్నాడు.