ఈ ఏడాదిలో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల తుది పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరిన స్వైటక్, కెనిన్ శనివారం టైటిల్ సమరంలో తలపడనున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్లకిదే తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి పోలాండ్ అమ్మాయిగా 19 ఏళ్ల స్వైటక్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుని.. రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సాగుతోంది 21 ఏళ్ల అమెరికా అమ్మాయి కెనిన్.
ట్రాక్‌రికార్డ్..
ఈ సీజన్లో ఇప్పటివరకూ 16-1 విజయాల రికార్డు ఉన్న కెనిన్ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్. అలా అని స్వైటక్ను తక్కువ అంచనా వేయలేం. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ హలెప్‌కు షాకిచ్చి.. అదే జోరులో ఫైనల్ చేరిన ఈ టీనేజీ అమ్మాయి వయసుకు మించిన నైపుణ్యాలతో ఆకట్టుకుంది. 1975లో డబ్ల్యూటీఏ కంప్యూటర్ ర్యాంకింగ్ విధానం మొదలు పెట్టిన తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన తక్కువ ర్యాంకు(54) క్రీడా కారిణిగా స్వైటక్ నిలవడం విశేషం. ఈ టోర్నీలో తుది సమరం చేరే క్రమంలో తను ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. కేవలం 23 గేమ్‌లు మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకుంది. నాలుగేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలికల సింగిల్స్ మూడో రౌండ్లో స్వైటక్ 6-4,7-5తో కెనిన్‌పై గెలవడం విశేషం. ఆ తర్వాత వీళ్లిద్దరూ మళ్లీ తరపడబోతుండడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి చెన్నైXబెంగళూరు: గెలుపు బాట పట్టేదెవరు?