ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ను లొంగదీసుకొని అతని ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తే తనకు ఒక వ్యక్తి భారీ మొత్తం ఆఫర్ చేశాడని సెర్బియాకు చెందిన మోడల్ నటాలిజా స్కెకిక్ వెల్లడించింది. ఓ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. లండన్‌కు చెందిన తనకు తెలిసిన వ్యక్తే ఈ ఆఫర్ చేశాడని తెలిపింది. జకోవిచ్‌తో శృంగారం చేసి దాన్ని చిత్రీకరిస్తే 60వేల యూరోలు, తాను అనుకున్న చోటుకు ట్రిప్ వెళ్లేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పాడని తెలిపింది.
"లండన్‌కు చెందిన ఓ వ్యక్తి నన్ను సంప్రదించాడు. నా డేట్ అడిగితే ఏదో బిజినెస్ పనిమీదేమో అనుకున్నా. తీరా సెర్బియా బ్రాండ్ అంబాసిడర్ అయిన జకోవిచ్‌ను ప్రలోభపెట్టి దాన్ని చిత్రీకరించేందుకు డబ్బులు ఇస్తామనడాన్ని విని షాక్‌కు గురయ్యా. తొలుత ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నప్పటికీ ఆ మాట సీరియస్‌గానే అన్నట్టు గుర్తించా. చాలా బాధపడ్డా. అవమానకరంగా భావించి ఆ ఆఫర్‌ను తిరస్కరించా" అని చెప్పుకొచ్చింది. గదిలో రహస్య కెమెరా అమర్చి జకోవిచ్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేయమని అతను కోరినట్టు ఆమె వెల్లడించింది.
"ఆ మాట చెప్పిన క్షణమే అతడిని లాగి కొట్టాలని, అతడిపై నీళ్లు పోసేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ బహిరంగ ప్రదేశంలో ఉండటం వల్ల నన్ను నేను నియంత్రించుకున్నాను. సెర్బియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న జకోవిచ్ ఇమేజ్‌ను నాశనం చేయాలని ప్రయత్నించే ఈ ప్రతిపాదనను విని షాకయ్యాను. అనంతరం నా వస్తువులను తీసుకొని అక్కడినుంచి బయటకు వచ్చేశాను" అని నటాలిజా వెల్లడించింది.
ఇదీ చదవండి: పొలార్డ్‌కు పితృవియోగం.. సచిన్ సంతాపం