ETV Bharat / sports

'పారిస్​ మాస్టర్స్​ టైటిల్​ నాకేం అవసరం లేదు'

పారిస్​ మాస్టర్స్​ టైటిల్​ తనకు అక్కర్లేదని అంటున్నాడు టెన్నిస్​ దిగ్గజం జకోవిచ్​. ఆ టూర్​లో పాల్గొని తన పాయింట్లను పోగొట్టుకోనని చెప్పాడు. నంబర్​ 1 ఆటగాడిగా టెన్నిస్​ చరిత్రలో ఎక్కవ రోజులు ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.

Djokovic not to play at Paris Masters
'పారిస్​ మాస్టర్స్​ టైటిల్​ నాకేం.. అవసరం లేదు'
author img

By

Published : Oct 21, 2020, 9:27 PM IST

ఈ ఏడాది పారిస్​ మాస్టర్స్​​ టైటిల్​ తనకు అవసరం లేదని టెన్నిస్ ప్రంపంచ నంబర్​-1​ ఆటగాడు జకోవిచ్​ అన్నాడు. సవరించిన​ ర్యాంకింగ్​ విధానం వల్ల పారిస్​ టూర్​లో ఆడి, పాయింట్లను కోల్పోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పాడు.

రెండో స్థానంలో ఉన్న రఫెల్​ నాదల్​కు, తనకు మధ్య దూరం పెరగడానికి ఈ ఏడాది చివర్లో ఆడుతానని చెప్పాడు. నంబర్​ 1 ఆటగాడిగా టెన్నిస్​ చరిత్రలో ఎక్కువకాలం నిలిచిపోవాలనుకుంటున్నానని తెలిపాడు.

"నేను పారిస్​లో ఆడి, నా పాయింట్స్​ పోగొట్టుకోను. కానీ, వియన్నా, లండన్​ టూర్లకు మాత్రం వెళ్తాను. వియన్నాలో గతేడాది నేను ఆడలేదు కాబట్టి నాకు 500 పాయింట్లు వచ్చే అవకాశముంది. లండన్​ టూర్​లోనూ చాలా పాయింట్లు లభిస్తాయి. కానీ, అది నా ప్రాధాన్యత కాదు. నేను త్వరగా పాయింట్లను సంపాదించాలనుకుంటున్నాను. తర్వాతి సీజన్​ వచ్చేవరకు నాదల్​తో పాయింట్ల వ్యత్యాసంలో సాధ్యమైనంత దూరంలో ఉంటాను. పారిస్​లో నాదల్ ఆడినా, ఆడకపోయినా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే.. అది నా చేతుల్లోనే ఉంది."

-- జకోవిచ్​, టెన్నిస్​ ఆటగాడు.

గత సీజన్​లో 36వ పారిస్​ మాస్టర్స్​ టైటిల్​ను గెలుచుకున్నాడు జకోవిచ్​. ఈ టోర్నీలో ఎక్కువసార్లు విజేతగా నిలిచి రఫెల్​ నాదల్​ రికార్డును చెరిపేశాడు.

ఇదీ చూడండి:పెళ్లి దుస్తుల్లో మహిళా క్రికెటర్ ఫోజులు.. నెట్టింట వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.