ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న మోంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. బ్రిటన్ ప్లేయర్ డాన్ ఇవాన్స్ చేతిలో 6-4, 7-5 తేడాతో ఓడిపోయాడు. అయితే తన కెరీర్లోనే ఇదో అత్యంత చెత్త ప్రదర్శన అని జకోవిచ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ విజయంతో ఇవాన్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
"నిజం చెప్పాలంటే ఇదొక చెత్త ప్రదర్శన. కోర్టులో ఇవాన్స్‌ను నిలువరించలేకపోయా. ఈ మ్యాచ్ మొత్తం భయంకరంగా భావించాను. ఏమీ చేయలేకపోయా. జన్నిక్తో మ్యాచ్‌కు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇవాన్స్ నా ఆటను కుప్పకూల్చాడు" అని నొవాక్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: 'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ
మరో స్టార్ ఆటగాడు, 11 సార్లు మోంటే కార్లో ఓపెన్ విజేత రఫెల్ నాదల్ క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. బల్గేరియా ప్లేయర్ డిమిత్రోవ్తో జరిగిన మ్యాచ్‌లో 6-1, 6-1 తేడాతో సునాయాస విజయం సాధించాడు. నాదల్ తన తదుపరి మ్యాచ్‌లో ఆండ్రీ రుబ్లేవ్తో తలపడనున్నాడు.
గ్రీక్ టెన్నిస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్.. క్రిస్టియన్ గారిన్ను 6-3, 6-4 తేడాతో ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.
ఇదీ చదవండి: 'ధోనీ.. ఏడో స్థానంలో వచ్చి ఏం సాధించలేవ్'