ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు - covid cases in australian open

ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు ముందు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో క్రీడాకారిణి వైరస్ బారిన పడింది. స్పెయిన్​ ప్లేయర్​ పాల్​ బడోసాకు కొవిడ్​ సోకినట్లు స్వయంగా ట్వీట్​ చేసింది.

Corona cases continues to the Australian Open
ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు కొనసాగుతున్న కరోనా సెగ
author img

By

Published : Jan 22, 2021, 1:10 PM IST

ఆస్ట్రేలియా ఓపెన్​కు ముందు మరో క్రీడాకారిణి కరోనా బారిన పడింది. క్వారంటైన్​లో ఉన్న 72 మందిలో.. స్పెయిన్​ ప్లేయర్​ పాల్​ బడోసాకు కొవిడ్​ సోకింది. ఈ విషయాన్ని బడోసా ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

"నాకొక చెడ్డ వార్త. ఈ రోజు నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. అనారోగ్యంగా ఉంది. కొన్ని వైరస్​ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సహకారంతో వీలైనంత తొందరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తాను. వారి సూచన మేరకు హోటల్​లో స్వీయ నిర్భందంలో ఉన్నాను." అని బడోసా ట్వీట్​ చేసింది.

గత రెండు వారాలుగా హోటల్​ గదులకే పరిమితమైన ఈ 67వ ర్యాంకర్​.. కరోనా సోకడం వల్ల మరో 14 రోజులు క్వారంటైన్​లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. అప్పటివరకు బడోసా నిర్బంధంలో ఉండాలని విక్టోరియా రాష్ట్ర ఆరోగ్య అధికారి బ్రెట్​ షట్టన్​ తెలిపారు. ​ ​

ఇదీ చదవండి: 'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.