ETV Bharat / sports

'కాలంతో మారింది వయసే.. వేదన కాదు'

అగ్రరాజ్యంలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు మరోసారి నిరసన తెలిపింది యువ టెన్నిస్​ ప్లేయర్​ కోకో గాఫ్​. తన చిన్నప్పటి నుంచి ఇప్పటికీ జాతి వివక్షత అలానే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్లోరిడాలోని డాల్రే బీచ్​ వద్ద నిరసనకారులు చేపట్టిన ఓ కార్యక్రమంలో ప్రసంగించింది.

black lives matter
'వయసు, మనుషులే మారారు.. వేదన అలానే ఉంది'
author img

By

Published : Jun 6, 2020, 9:18 AM IST

నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల అమెరికాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదివరకే ఓ వీడియో ద్వారా తన అసహనాన్ని వెల్లగక్కిన టీనేజీ టెన్నిస్‌ సంచలనం కోకో గాఫ్..‌ మరోసారి తన నిరసన గళాన్ని బలంగా వినిపించింది. తన నివాస గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె తన ఆవేశాన్ని, ఆవేదనను బయటపెట్టింది.

"నేను మా బామ్మతో ఉంటున్నా. 50 ఏళ్ల క్రితం ఆమె ఏ విషయం కోసం పోరాడిందో.. ఇప్పుడు నేను అదే జాతి వివక్ష గురించి నిరసన తెలియజేస్తుండడం బాధ కలిగిస్తోంది. ఇన్నేళ్లలో ఏం మారలేదు. ఏదేమైనా ఒకరితో మరొకరు ప్రేమగా ఉండడం అవసరం. ఈ ఉద్యమానికి వాళ్లు ఏ మేరకు సాయం అందించగలరోనని నల్లజాతీయులు కాని నా మిత్రులతో చర్చిస్తూనే ఉన్నా. నాతో పాటు అందరి భవిష్యత్‌ కోసం మీరు ముందుకు రావాలి. మార్పు తీసుకురావడానికి ఇదో మార్గం. వేదిక ఏదైనా మీ గళాన్ని వినిపించండి"

-- కోకో గాఫ్​

"మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ చెప్పినట్లు.. చెడ్డవాళ్ల క్రూరత్వం కంటే మంచివాళ్ల మౌనం చాలా ప్రమాదకరం. మీరు మౌనంగా ఉంటే.. అణిచివేతను సమర్థిస్తున్నారని అర్థం. 'అది నా సమస్య కాదు కాబట్టి ఎందుకు స్పందించాలి' అని చాలా మంది అనుకుంటున్నారు. మీరు నల్ల జాతీయులు పాడిన పాటలు వింటుంటే.. వాళ్ల సంస్కృతిని ఇష్టపడుతుంటే.. మీకు వాళ్లలో స్నేహితులు ఉంటే.. ఈ పోరాటం మీది కూడా. కేవలం ఫ్లాయిడ్‌ ఒక్కడే కాదు కొన్నేళ్లలో ఇలా ఎంతో మంది చనిపోయారని మీరు తెలుసుకోవాలి. నా ఎనిమిదేళ్ల వయసులో ట్రేవన్‌ మార్టిన్‌ను చంపేశారు. ఇప్పుడు నాకు 16. ఇప్పటికీ మార్పు కోసం పోరాడుతూనే ఉన్నాం" అని కోకో పేర్కొంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ రికార్డు పోయినా.. గ్రాండ్‌స్లామ్‌ల శతకం కొడతా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.