ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి బోపన్న ఔట్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పలువురు టాప్​ సీడ్​ ఆటగాళ్లు పరాజయం మూటగట్టుకున్నారు. పురషుల డబుల్స్​ నుంచి భారత ఆటగాడు రోహన్​ బోపన్న జంట ఓటమి పాలైంది. మాజీ యూఎస్ ఓపెన్​ విజేత ఆండ్రెస్కు సైతం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

SPF14-SPO-TENNIS-OPEN-IND
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి బోపన్న ఔట్​
author img

By

Published : Feb 10, 2021, 11:48 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్ నుంచి​ మాజీ యూఎస్​ ఓపెన్ ఛాంపియన్ బియాంకా ఆండ్రెస్కు నిష్క్రమించింది. రెండో రౌండ్​లో తైవాన్​ ప్లేయర్​ సై సు వీ చేతిలో 6-3, 6-2 తేడాతో పరాజయం పాలైంది. ప్రత్యర్థి ముందు ఆండ్రెస్కు నిలవలేకపోయింది. తాను ఓడిపోయినప్పటికీ.. తిరిగి ఆటలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపింది.

2019 యూఎస్ ఓపెన్​ ఫైనల్లో సెరెనా విలియమ్స్​ను మట్టికరిపించి టైటిల్​ సొంతం చేసుకున్న ఆండ్రెస్కు.. మోకాలి గాయం కారణంగా 2020 ఏడాది మొత్తం ఆటకు దూరమైంది. తిరిగి ప్రస్తుతం ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టోర్నీలో మళ్లీ రాకెట్​ పట్టింది.

మరో గేమ్​లో సెరెనా విలియమ్స్​, సెర్బియన్​ ప్లేయర్​ నైనా స్టోజనోవిక్​ను ఓడించింది. 6-3, 6-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది సెరెనా. మొదటి రౌండ్​ గెలిచాక రెండో రౌండ్​ తేలికైందని ఈ అమెరికన్​ ప్లేయర్​ తెలిపింది.

గత ఎనిమిదేళ్ల తర్వాత టాప్​ టోర్నీ ఆడుతున్న కెనడా క్రీడాకారిణి రెబెక్కా మారినో కూడా ఓటమి చవిచూసింది. 19వ సీడ్​ ప్లేయర్​ మార్కెటా వండ్రోసోవా చేతిలో 6-1, 7-5 తేడాతో పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్​లో రష్యా ఆటగాడు అస్లాన్​ కరత్సేవ్​ చేతిలో బెలారస్​ ఆటగాడు ఎగోర్ గెరాసిమోవ్ ఓడిపోయాడు. 6-0, 6-1, 6-0 తేడాతో ఘోర ఓటమిని చవిచూశాడు. మరో వైపు, ఫ్రెంచ్​ ఆటగాడు అలెగ్జాండర్​ ముల్లర్​పై అర్జెంటీనా క్రీడాకారుడు డియెగో స్క్వార్ట్జ్మాన్ విజయం సాధించాడు.

బోపన్న ఔట్​..

పురుషుల డబుల్స్​లో జరిగిన మ్యాచ్​లో రోహన్​ బోపన్న జోడీ ఓటమి పాలైంది. జపాన్​ ఆటగాడు బెన్​ మెక్​లాచ్లన్​తో జతకట్టిన బోపన్న.. కొరియా ప్లేయర్ల చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు.

6-4, 7-6, 7-0 తేడాతో జి సంగ్​ నం, మిన్​-క్యూ సాంగ్​ జంట బోపన్న జోడీపై ఆధిపత్యం చెలాయించింది. వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ప్రవేశించిన వీరిద్దరూ అద్భుతంగా ఆడారు.

టోర్నీ ప్రారంభానికి ముందు తగినంత ప్రాక్టీస్​ లేకపోవడమే బోపన్న ఓటమికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్​ అనంతరం ఓటమి బాధలో మెక్​ లాచ్లాన్​ తన రాకెట్​ను కోర్టుపై విసిరికొట్టగా.. అది అతని తలకు తగిలేలా వచ్చింది. కానీ దాని నుంచి అతడు తప్పించుకున్నాడు.

ఇదీ చదవండి: ఎమ్​సీజీలో 'ది రికార్డ్​' వేడుకలకు ఆసీస్​ టీమ్ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.