వింబుల్డన్‌లో(Wimbledon) మహిళల సింగిల్స్ ఆఖరి అంకం ముగిసింది. తుది పోరులో టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచి, కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. చివరిసారిగా 2019 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఈమెకు వరించింది.
శవివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను 6-3,6-7(4),6-3 తేడాతో మట్టికరిపించింది. తొలిసెట్‌లో అలవోకగా గెలిచిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ రెండో సెట్‌లో కాస్త తడబడిపోయింది. దాంతో ప్లిస్కోవా పైచేయి సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠస్థితికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మూడోసెట్ అనివార్యమవ్వగా ఈసారి బార్టీ ఆధిపత్యం చెలాయించింది. చివరికి తన కలను నిజం చేస్తూ టైటిల్ ఎగరేసుకుపోయింది. 1980 తర్వాత ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో సింగిల్స్‌లో ట్రోఫీలో గెలుచుకున్న తొలి ఆస్ట్రేలియన్‌గా నిలిచింది.
-
🏆 #Wimbledon | @ashbarty pic.twitter.com/JC25bcZp8X
— Wimbledon (@Wimbledon) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏆 #Wimbledon | @ashbarty pic.twitter.com/JC25bcZp8X
— Wimbledon (@Wimbledon) July 10, 2021🏆 #Wimbledon | @ashbarty pic.twitter.com/JC25bcZp8X
— Wimbledon (@Wimbledon) July 10, 2021
మరోవైపు వింబుల్డన్ బాలుర విభాగంలో ఇండో-అమెరికన్ సమీర్ బెనర్జీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడు సెమీస్‌లో గీమార్ట్ వేయన్‌బర్గ్‌పై విజయం సాధించాడు.
ఇదీ చూడండి: ఫ్రెంచ్ ఓపెన్: అప్పుడు 5 లక్షలు.. ఇప్పడు 5 వేలు