ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి దివిజ్, అంకిత ఔట్

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పురుషుల డబుల్స్​, మహిళల డబుల్స్​లో భారత్ కథ ముగిసింది. తొలి రౌండ్​లోనే దివిజ్, అంకిత ఓటమి పాలై, టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Australian
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి దివిజ్, అంకిత ఔట్
author img

By

Published : Feb 11, 2021, 3:22 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి భారత టెన్నిస్ ప్లేయర్లు దివిజ్ శరణ్, అంకిత రైనా నిష్క్రమించారు. గురువారం జరిగిన తొలి రౌండ్​లో పురుషుల డబుల్స్​లో దివిజ్, మహిళల డబుల్స్​లో అంకిత వరుస సెట్లలో ఓడిపోయారు.

అరంగేట్రంలో నిరాశ..

అంకిత.. గ్రాండ్​స్లామ్​ మెయిన్​ డ్రాలో భారత్​ తరఫున పోటీ చేస్తున్న ఐదో మహిళ మాత్రమే కావడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన జోడీ ఒలీవియా గడెక్కీ, బెలిండా వూల్​కాక్ చేతిలో తన భాగస్వామి మిహేలాతో కలిసి 3-6, 0-6 తేడాతో పరాజయం పాలైంది అంకిత.

పురుషుల డబుల్స్​లోనూ దివిజ్ నిష్క్రమణతో భారత్ కథ ముగిసింది. జెర్మనీ ద్వయం యాన్నిక్, కెవిన్​ చేతుల్లో తన పార్ట్​నర్ ఇగోర్ జీలెనేతో కలిసి 1-6, 4-6 తేడాతో ఓడిపోయాడు దివిజ్.

మిగిలింది ఒక్కడే..

ఇక ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భారత్ తరఫున మిగిలింది సీనియర్ బోపన్న మాత్రమే. పురుషుల డబుల్స్​లో బుధవారం తొలి రౌండ్​లోనే ఓటమి పాలైన బోపన్న.. మిక్స్​డ్​ డబుల్స్​లో పోటీ పడనున్నాడు. చైనాకు చెందిన యింగ్​యింగ్​తో కలిసి అమెరికా జోడీ మాటెక్ సాండ్స్​, జామీ ముర్రేతో తొలి రౌండ్​లో తలపడనున్నాడు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​: మూడో రౌండ్​కు సెరెనా, జకోవిచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.