ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన పోరులో టేలర్ ఫ్రిట్జ్‌పై 7-6, 6-4, 3-6, 4-6, 6-2 తేడాతో శ్రమపడి గెలుపొందాడు.
తొలి రెండు సెట్లలో ఓడిన ఫ్రిట్జ్.. అనూహ్యంగా పుంజుకొని 3, 4 సెట్లను కైవసం చేసుకున్నాడు. అయితే చివరి సెట్లో నెగ్గి జకో.. రౌండ్లో విజయం సాధించాడు.
మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయర్ డొమినిక్ థీమ్.. మూడో రౌండ్లో నిక్ కిర్గియోస్‌పై విజయం సాధించాడు. 4-6, 4-6, 6-3, 6-4, 6-4 తేడాతో గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ నాలుగో రౌండ్ చేరింది. వెరోనికాపై 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్‌కు సెరెనా