సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో అస్లాన్ కరాత్సెవ్పై 6-3, 6-4, 6-2 తేడాతో నొవాక్ అలవోకగా విజయం సాధించాడు. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే నిష్క్రమిస్తాడనుకున్న జకోవిచ్.. అలాంటి ఇబ్బందేమీ లేకుండా ఫైనల్ చేరాడు. ఇప్పటివరకు 17 గ్రాండ్‌స్లామ్‌లు కైవసం చేసుకున్న నొవాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్రతిసారి టైటిల్ సాధించాడు.
కాగా, రష్యాకు చెందిన కరాత్సెవ్.. గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లోకి రావడం ఇదే తొలిసారి. మొదటి గ్రాండ్‌స్లామ్‌లోనే సెమీస్ చేరిన తొలి రష్యా టెన్నిస్ ఆటగాడు కూడా ఇతనే.
ఇదీ చదవండి: రిచర్డ్సన్కు భారీ ధర.. పంజాబ్ సొంతం