ETV Bharat / sports

అందరి లక్ష్యం ఒకటే.. #ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ - tennis news

మెల్​బోర్న్ వేదికగా ఆస్ట్రేలియన్ ఓపెన్​.. నేటి(సోమవారం) నుంచి మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్నాడు జకోవిచ్. టైటిల్​ కొట్టాలనే ఉత్సాహంతో పలువురు ప్రముఖ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు.

అందరి లక్ష్యం ఒకటే.. #ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020
author img

By

Published : Jan 20, 2020, 5:21 AM IST

టెన్నిస్‌లో ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు రోజర్‌ ఫెదరర్‌ రికార్డుపై రఫెల్‌ నాదల్‌ కన్నేశాడు. అమ్మగా తొలి టైటిల్‌ సాధించిన సెరెనా విలియమ్స్‌.. రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టింది. మాజీ నం.1 వోజ్నియాకి ఈ టైటిల్‌ నెగ్గి కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని కోరుకుంటోంది. ఎన్నో ఆశలతో బరిలో దిగుతోన్న దిగ్గజాలకు షాకివ్వాలని జూనియర్లు కృతనిశ్చయంతో ఉన్నారు.

roger federer
స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్

ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డు అందుకునేందుకు నాదల్‌ ఒక్క టైటిల్‌ దూరంలో ఉన్నాడు. ఫెదరర్‌ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే, నాదల్‌ 19 టైటిళ్లు సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫెదరర్‌తో పాటు సమానంగా నిలవాలనే పట్టుదలతో నాదల్‌ ఉన్నాడు.

ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఒకేసారి 2009లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన నాదల్‌.. ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా తన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని ఫెదరర్‌ కోరుకుంటున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ నుంచి టైటిల్‌ వేటలో వీళ్లిద్దరికీ గట్టిపోటీ ఎదురుకానుంది.

novak djokovic
డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్

మహిళల విభాగంలో డెన్మార్క్‌ క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నం.1 కరోలిన్‌ వోజ్నియాకి తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడబోతుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఆమె ఇప్పటికే ప్రకటించింది. 2018లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన 29 ఏళ్ల వోజ్నియాకి.. ఫ్రెంచ్‌ ఓపెన్లో రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

తల్లయిన తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్న మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జోరు అందుకోవాలని చూస్తోంది. ఇందులో విజయంతో మార్గరెట్‌ 24 గ్రాండ్‌స్లామ్‌ల ఆల్‌టైమ్‌ రికార్డును అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం 23 టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్న ఈ అమెరికా తార.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో కలను నిజం చేసుకుంటుందో లేదో చూడాలి.

మరోవైపు భారత అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు ప్రజ్ఞేశ్‌.. ప్రధాన డ్రాకు అర్హత సాధించాడు. క్వాలిఫయర్‌ ఫైనల్‌ రౌండ్లో అతను ఓడినప్పటికీ.. ప్రధాన డ్రా నుంచి ఓ ఆటగాడు తప్పుకోవడం వల్ల ఆ అవకాశం అదృష్టవశాత్తూ ప్రజ్ఞేశ్‌ను వరించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST TV - AP CLIENTS ONLY
Berlin - 19 January 2020
1. Commander of the self-styled Libyan Arab Armed Forces, General Khalifa Hifter, briefly seen on landing of stairs in Chancellery (red tie, moustache)
2. Conference sign
3. Libyan, European Union, United Nations and German flags
STORYLINE:
Germany on Sunday brought together the key players in Libya’s long-running civil war.
The international conference in Berlin seeks to curb foreign military interference, solidify a ceasefire and help relaunch a political process to stop the chaos in the North African nation.
Among the leaders attending are Libya's two main rival leaders, General Khalifa Hifter and Prime Minister Fayez Sarraj.
Chancellor Angela Merkel and her foreign minister met both men at the chancellery ahead of the summit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.