ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: చైనాలో జరగబోయే టెన్నిస్ టోర్నీలన్నీ రద్దు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తున్న క్రమంలో చైనా వేదికగా జరగాల్సిన పురుషుల, మహిళల టెన్నిస్​ టోర్నీలు రద్దయ్యాయి. ఈ నిర్ణయంతో మాస్టర్స్​ 1000 టోర్నీతో పాటు మరో నాలుగు టోర్నీలు తుడిచిపెట్టుకుపోయాయి.

author img

By

Published : Jul 24, 2020, 3:14 PM IST

ATP, WTA cancel all China events including WTA Finals
కరోనా ఎఫెక్ట్​: టెన్నిస్​ టోర్నీలను రద్దు చేసిన చైనా

కరోనా మహమ్మారి కారణంగా చైనా వేదికగా అక్టోబరులో జరగాల్సిన పురుషుల, మహిళల టెన్నిస్​ టోర్నీలతో పాటు ఉమెన్స్​ టెన్నిస్​ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ)​ ఫైనల్స్​ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్​ను వాయిదా వేయడానికి బదులుగా టెన్నిస్​ టోర్నీలన్నీ రద్దు చేయాలని చైనా జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ ఆఫ్​ స్పోర్ట్స్​ ప్రపంచ టెన్నిస్ సమాఖ్యను కోరింది.

"చైనా వేదికగా నిర్వహించాల్సిన ప్రపంచ స్థాయి పోటీలు జరగకపోవటం మాకు చాలా నిరాశను కలిగిస్తోంది. రద్దు చేయాలన్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. వచ్చే సీజన్లో వీలైనంత త్వరగా చైనాలో తిరిగి టోర్నీని నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నాం".

- స్టీవ్​ సైమన్​, డబ్ల్యూటీఏ ఛైర్మన్​

ఈ నిర్ణయంతో ఆసియాలో జరిగే ఏటీపీ టోర్నీ మాస్టర్స్​ 1000తో పాటు మరో నాలుగు పురుషుల ఈవెంట్లు తుడిచిపెట్టుకుపోయాయి. "కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఈ ఏడాది చైనాలో నిర్వహించాల్సిన టోర్నీలు జరగవని ప్రకటించడం చాలా విచారంగా ఉంది" అని ఏటీపీ ఛైర్మన్ ఆండ్రియా గౌడెంజి తెలిపాడు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రణాళిక చేసిన టెన్నిస్​ టోర్నీలు మార్చి నుంచి నిలిపేశారు. డబ్ల్యూటీఏ, ఏటీపీ పర్యటనలు ఆగస్టులో తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్న క్రమంలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. ప్రస్తుత గ్రాండ్​స్లామ్​ టోర్నీ యుఎస్​ ఓపెన్​, ఆగస్టు 31న న్యూయార్క్​లో ప్రారంభం కానుంది. వేసవిలో జరగాల్సిన ఫ్రెంచ్​ ఓపెన్​ మే నుంచి సెప్టెంబరుకు వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.