ఆసీస్ టెన్నిస్ క్రీడాకారిణి... ఎనిమిదో సీడ్ ఆష్లీ బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం వొంద్రుసోవాతో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్స్‌లో తలపడి గెలిచింది. తన దేశానికి 46 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అందించింది. మరి ఇంత ఘనత సాధించిన ఈ స్టార్ ప్లేయర్ ఒకప్పడు క్రికెటర్ కూడా.
బార్టీ మొదట టెన్నిస్‌లో అడుగుపెట్టింది. తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకొని 2015లో క్వీన్స్లాండ్ క్రికెట్ బోర్డుని సంప్రదించి క్రికెట్లో తొలి అడుగులు వేసింది. ఈ సమయంలోనే ఆమె 'వెస్టర్న్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్స్' క్లబ్ తరఫున బ్యాట్ పట్టి మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టినా పెద్దగా రాణించలేదు. కొద్ది కాలం క్రికెట్ ఆడిన ఈ అమ్మడు... బిగ్ బాష్ లీగ్ అనంతరం మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టింది.
బార్టీ టెన్నిస్‌లోకి వచ్చాక నాలుగు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 10 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అందులో 2018 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిట్ కూడా ఉంది.
ఇవీ చూడండి: