భారత అగ్రశ్రేణి మహిళా టెన్నిస్ ప్లేయర్లలో ఒకరు అంకిత రైనా. ఇటీవల ఐటీఎఫ్ తొలి సీజన్ మొదటి టైటిల్ నెగ్గిన ఈ అమ్మడు... రెండు వారాలైనా గడవకముందే మరో డబుల్స్ టైటిల్ ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 157వ స్థానానికి దూసుకెళ్లింది.
థాయ్‌లాండ్ వేదికగా నేడు జరిగిన ఐటీఎఫ్ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో... జియా కీ ఖంగ్, మియాబీ జోడీపై 6-2, 3-6, 10-7 తేడాతో గెలిచింది అంకిత, బిబేన్ స్కూఫ్ ద్వయం. ఫలితంగా వరుసగా రెండో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుందీ జంట.
వరుస టైటిళ్లు...
ఇటీవల థాయ్‌లాండ్‌లోని నోన్త్బారిలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ సింగిల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది అంకిత. ఇది ఈ ఏడాది తొలి ఐటీఎఫ్ టైటిల్. ఇదే వేదికపై బిబేన్ స్కూఫ్(డచ్)తో కలిసి డబుల్స్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది.