ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన అంకిత రైనా కూడా ఇంటిముఖం పట్టింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఈ భారత నెంబర్‌వన్ జపాన్‌కు చెందిన కురుమి నరా చేతిలో 3-6, 2-6 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది.
"మెరుగ్గానే ఆడా. కొన్ని అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయా. లేకపోతే ఫలితం వేరేలా ఉండేది" అని పరాజయం అనంతరం చెప్పింది అంకిత.
పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్ఞేష్ గణేశ్వరన్ ఇప్పటికే ఓటమి పాలయ్యారు. ఈనెల 27న ప్రారంభంకానున్న ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్‌డ్రాలో డబుల్స్‌లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ తమ భాగస్వాములతో బరిలో దిగనున్నారు.