ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వాలిఫయర్స్​: ఫైనల్​ రౌండ్​కు అంకిత - ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వాలిఫైయర్స్ ఫైనల్​లో అంకిత రైనా

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వాలిఫయర్స్​లో ఫైనల్​ రౌండ్​కు దూసుకెళ్లింది భారత టెన్నిస్​ క్రీడాకారిణి అంకిత రైనా. రెండో రౌండ్లో ఉక్రెయిన్​కు చెందిన కేథరీనా జవస్కాపై విజయం సాధించి.. తుది రౌండ్​కు చేరుకుంది. అందులో నెగ్గితే ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మెయిన్​ డ్రాకు అర్హత సాధిస్తుంది.

Ankita moves to final round, Ramkumar bows out of Australian Open Qualifiers
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ క్వాలిఫయిర్స్​: ఫైనల్​ రౌండ్​కు అంకిత
author img

By

Published : Jan 13, 2021, 7:03 AM IST

Updated : Jan 13, 2021, 7:22 AM IST

గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి పోటీపడి ఎనిమిదేళ్లయ్యింది. చివరగా 2012లో సానియా మీర్జా బరిలో దిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు. ఆ ఘనత సాధించేందుకు ఆరోసారి ప్రయత్నం చేస్తున్న భారత టెన్నిస్​ ప్లేయర్​ అంకిత రైనా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో ఫైనల్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇంకో మ్యాచ్‌ గెలిస్తే చాలు ఆమె ప్రధాన డ్రాకు అర్హత పొందుతుంది.

మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 180వ ర్యాంకర్‌ అంకిత 6-2, 2-6, 6-3తో 118వ ర్యాంకర్‌ కేథరీనా జవస్కా (ఉక్రెయిన్‌)కు షాకిచ్చింది. ఫైనల్లో ఆమె 183వ ర్యాంక్‌లో ఉన్న ఓల్గా డానిలోవిచ్‌ (సెర్బియా)ను ఢీకొంటుంది. ఇప్పటివరకు భారత్‌ నుంచి నిరుపమ వైద్యనాథన్‌, సానియా మీర్జా మాత్రమే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో పోటీపడ్డారు.

Ankita moves to final round, Ramkumar bows out of Australian Open Qualifiers
టెన్నిస్​ క్రీడాకారిణి అంకిత రైనా

పురుషుల విభాగంలో రామ్‌కుమార్‌ రామనాథన్‌ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో రామ్‌కుమార్‌ 3-6, 2-6తో తుంగ్‌ లిన్‌ వు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. కరోనా నేపథ్యంలో క్వాలిఫయర్స్‌ను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: అడల్ట్​ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టెన్నిస్​ స్టార్​!

Last Updated : Jan 13, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.