గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మెయిన్ డ్రాలో అడుగు పెట్టేందుకు చేసిన ఆరో ప్రయత్నంలోనూ అంకిత రైనా విఫలమైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్ ఆఖరి రౌండ్లో ఆమెకు ఓటమి ఎదురైంది.
బుధవారం మూడు సెట్ల పోరులో అంకిత 2-6, 6-3, 1-6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయంపాలైంది. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి సుమిత్ నాగల్ మాత్రమే పోటీపడనున్నాడు. పురుషుల విభాగంలో అతడికి వైల్డ్‌కార్డు లభించింది.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్: ఫైనల్ రౌండ్‌కు అంకిత