ETV Bharat / sports

Wimbledon: రెండో రౌండ్​కు ఫెదరర్, జ్వెరెవ్, కెర్బర్, బార్టీ

వింబుల్డన్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు ఫెదరర్(Roger Federer). ఫ్రాన్స్​కు చెందిన మన్నారినో ఇతడికి గట్టి పోటీ ఇచ్చాడు. అలాగే జ్వెరెవ్, ముర్రే(Andy Murray) కూడా రెండో రౌండ్​కు చేరారు. మహిళల విభాగంలో కెర్బర్(Angelique Kerber), ఆష్లే బార్టీ(Ashleigh Barty), వీనస్ విలియమ్స్(Venus Williams)​ తొలి రౌండ్​లో విజయం సాధించారు.

Wimbledon
వింబుల్డన్
author img

By

Published : Jun 30, 2021, 6:45 AM IST

ఎనిమిదిసార్లు ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌(Roger Federer) కష్టంగా వింబుల్డన్‌(Wimbledon​) రెండో రౌండ్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో మన్నారినో (ఫ్రాన్స్‌) నుంచి అతడికి గట్టి పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) 6-4, 6-7 (3-7), 3-6, 6-2తో ఉన్నప్పుడు ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు. తొలి సెట్‌ను కోల్పోయినా పుంజుకున్న మన్నారినో తర్వాతి రెండు సెట్లలో నెగ్గి ఫెదరర్‌కు చెమటలు పట్టించాడు. నాలుగో సెట్లో ఫెదరర్‌ పుంజుకుని 3-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 4-2తో నిలిచాడు. మన్నారినో గాయానికి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఫెదరర్‌ సెట్‌ గెలిచాక మన్నారినో రిటైరయ్యాడు.

  • నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(Alexander Zverev-జర్మనీ) అలవోకగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న అతడు మొదటి రౌండ్లో 6-3, 6-4, 6-1తో డచ్‌ క్వాలిఫయర్‌ టాలన్‌ గ్రీక్స్‌పూర్‌పై నెగ్గాడు. జ్వెరెవ్‌ 20 ఏస్‌లు కొట్టాడు.
  • 9వ సీడ్‌ ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా) తొలి రౌండ్‌ను అధిగమించాడు. అతడు 6-3, 6-4, 6-0తో పైర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు.
  • ఆండీ ముర్రే(Andy Murray-బ్రిటన్‌) 6-4, 6-3, 5-7, 6-3తో బసిలష్విలి (జార్జియా)పై విజయం సాధించాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచుల్లో ఎవాన్స్‌ (బ్రిటన్‌) 7-6 (7-4), 6-2, 7-5తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలిచారు.
    Andy Murray
    ముర్రే

కెర్బర్‌ ముందుకు

  • టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(Ashleigh Barty) వింబుల్డన్‌లో రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె 6-1, 6-7 (1-7), 6-1తో నవారో (స్పెయిన్‌)పై నెగ్గింది.
  • కెర్బర్‌ (Angelique Kerber-జర్మనీ), ప్లిస్కోవా (చెక్‌) శుభారంభం చేశారు. కెర్బర్‌ 6-4, 6-3తో స్టొజనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించగా.. ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా 7-5, 6-4తో జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై గెలిచింది.
  • వీనస్‌ విలియమ్స్‌(Venus Williams-అమెరికా), సకారి (గ్రీస్‌) కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. ఆరంభ రౌండ్లో వీనస్‌ 7-5, 4-6, 6-3తో బుజార్నెస్కూ (రొమేనియా)పై, సకారి 6-1, 6-1తో అరాంటా రుస్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించారు.

ఇవీ చూడండి: Wimbledon: జకోవిచ్, సబలెంక శుభారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.