నవంబర్ 29,30 లేదా నవంబర్ 30 డిసెంబర్ 1తేదీలలో భారత్-పాకిస్థాన్ మధ్య డేవిస్ కప్ టై మ్యాచ్‌లు జరుగుతాయని భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది. మ్యాచ్‌లు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతాయా లేక తటస్థ వేదికలో జరుగుతాయా అన్నది నవంబర్ 4న తెలుస్తుందని తెలిపింది. ఆరోజు సెక్యురిటీ విషయాలపై సమీక్ష జరుపుతామని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్‌కు లేఖ రాసిన భారత టెన్నిస్ సమాఖ్య మ్యాచ్‌లు తటస్థ వేదికకు మార్చాలంటూ సూచించింది.
గతంలో భారత టెన్నిస్ సంఘం వేదిక మార్చాలని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్. ఇటీవల భారత ఆటగాళ్లు తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ టోర్నీ కోసం మహేశ్ భూపతి సారథ్యంలో ఆరుగురు ఆటగాళ్ల జట్టును ప్రకటించింది భారత టెన్నిస్ సంఘం.
ఇవీ చూడండి.. ఈసీబీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆండ్రూ స్ట్రాస్