ETV Bharat / sports

మాడ్రిడ్ ఓపెన్ టైటిల్​ విజేతగా జ్వరెవ్

మాడ్రిడ్​ ఓపెన్ విజేతగా జర్మనీ టెన్నిస్ ప్లేయర్​ అలెగ్జాండర్ జ్వరెవ్​ నిలిచాడు. ఫైనల్లో ఇటలీ ఆటగాడు మాటియో బెర్రెట్టినిపై విజయం సాధించి, టైటిల్​ సొంతం చేసుకున్నాడు.

Alexander Zverev
జ్వరెవ్
author img

By

Published : May 10, 2021, 2:50 PM IST

మాడ్రిడ్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో జర్మనీ టెన్నిస్​ ఆటగాడు అలెగ్జాండర్​ జ్వరెవ్​ విజయం సాధించాడు. ఇటలీ ప్లేయర్​ మాటియో బెర్రెట్టినిపై 6-7(8), 6-4, 6-3 తేడాతో గెలిచి, టైటిల్​ను సొంతం చేసుకున్నాడు. జ్వరెవ్​కిది రెండో మాడ్రిడ్ ఓపెన్ కాగా.. నాలుగో ఏటీపీ మాస్టర్స్​ 1000 ట్రోఫీ.

తుదిపోరులో తొలి సెట్​ను కోల్పోయిన జ్వరెవ్​.. తర్వాతి రెండు సెట్లలో పుంజుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో ముగ్గురు టాప్​-10 ప్లేయర్లను దాటేసి.. టైటిల్​ను కైవసం చేసుకున్నాడు. "గత మూడు టైటిళ్ల ఫైనల్​ మ్యాచ్​ల్లో ఓటమి అనంతరం.. మాడ్రిడ్​ ఓపెన్​ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ టైటిల్​ నాకు ఎంతో ప్రత్యేకం" అని జ్వరెవ్​ హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: మాడ్రిడ్‌ ఓపెన్‌ ఛాంప్‌ సబలెంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.