టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్ చివరి మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో(Bravo Retirement). ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణ ఏమిటన్నదానిపై స్పష్టత ఇచ్చాడు.
"క్రికెట్ ఆడటం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్న రోజు తప్పనిసరిగా కోచింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. క్రికెట్ నుంచి మాత్రం దూరంగా వెళ్లిపోయే సమస్యే లేదు. నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఇచ్చింది క్రికెటే. అందుకే జట్టుకు తిరిగివాల్సింది చాలా ఉందనేది నా అభిప్రాయం."
-- డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడతానని చెప్పాడు బ్రావో.
ఇప్పటివరకు 40 టెస్టులు ఆడిన బ్రావో.. 2,200 పరుగులు చేశాడు. 86 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 2,968 పరుగులు చేసి 199 వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్‌ల్లో 1,245 పరుగులు చేసి, 78 వికెట్లు పడగొట్టాడు.
రిటైర్మైంట్ ఇంకా ప్రకటించలేదు: గేల్
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా శనివారం(నవంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీస్ అవకాశాన్ని దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ నేపథ్యంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రిటైర్మెంట్(gayle retirement news) ప్రకటించబోతున్నట్లే ప్రవర్తించాడు. కానీ, సరదా కోసమే అలా చేశానని తర్వాత చెప్పుకొచ్చాడు.
"అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంకా వీడ్కోలు చెప్పలేదు. సరదా కోసమే అలా చేశాను. జమైకా వేదికగా సొంత అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్ ఆడాకే ఘనంగా వీడ్కోలు పలకుతాను. నిజానికి నాకు ఇంకో ప్రపంచకప్ కూడా ఆడాలని ఉంది. కానీ, బోర్డు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు."
-- క్రిస్ గేల్, వెస్టిండీస్ క్రికెటర్.
తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు గేల్. తన చివరి మ్యాచ్ కోసం విండీస్ బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: