టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ఫైనల్లో టీమ్ఇండియా, పాకిస్థాన్ తలపడితే.. అది చాలా గొప్ప విషయమవుతుందని పాకిస్థాన్ దిగ్గజం సక్లైన్ ముస్తాక్(Saqlain Mushtaq Coach) అభిప్రాయపడ్డాడు. తుది పోరులో ఈ రెండు జట్లు ఆడితేనే అభిమానులు మరింత సంతోషిస్తారని అన్నాడు. ఇటీవల జరిగిన తమ తొలి మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ స్నేహభావాన్ని ప్రదర్శించడంపై ప్రశంసలు కురిపించాడు.
"టీమ్ఇండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తే బాగుంటుంది. పాకిస్థాన్ ఆ జట్టును ఓడించింది అని ఇలా చెప్పడం లేదు. భారత జట్టు చాలా దృఢంగా ఉంది. చాలా మందికి ఫేవరెట్ జట్టు కూడా. మరో మ్యాచ్ భారత్, పాక్ ఆడితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే అవకాశాలున్నాయి."
--సక్లైన్ ముస్తాక్, పాకిస్థాన్ జట్టు కోచ్.
తొలి మ్యాచ్ అనంతరం.. విరాట్ కోహ్లీ, ధోనీ పాక్ ఆటగాళ్లతో మాట్లాడి క్రీడా స్ఫూర్తిని చాటారని సక్లైన్(Saqlain Mushtaq News) అన్నాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్‌ను ఓ గేమ్‌లాగానే చూడాలని, ఇరు జట్లు మంచి బంధాన్ని కొనసాగించాలని సూచించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు కూడా టీ20 ప్రపంచకప్‌లో గట్టి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం(అక్టోబర్ 29) అప్ఘానిస్థాన్‌తో తలపడనుంది పాక్. కాగా.. ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో(IND vs NZ T20) మ్యాచ్ ఆడనుంది భారత్.
ఇదీ చదవండి: