సాధారణంగా ఏదైనా క్రికెట్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన లేదా ఎక్కువ వికెట్లు పడగొట్టిన వారికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వడం సహజం. అయితే ఈసారి టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup) పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను(wasim akram on babar azam) కాదని.. డేవిడ్ వార్నర్‌కు అవార్డు వరించింది. దీనిపై క్రికెట్ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. కొందరేమో ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపగా.. మరికొందరు సరైన నిర్ణయం కాదని తప్పుబడుతున్నారు. మరి ఎందుకు అలా ఇచ్చారనేదానిపై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ వివరించాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఫైనల్‌లో కివీస్‌పై విజయం సాధించి ఆసీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (303) కంటే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (289) పరుగులపరంగా వెనుకనే ఉన్నాడు. అయినా బాబర్‌ను కాదని వార్నర్‌కు(David Warner) మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఐసీసీ ప్రకటించింది. దీనిపై పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వార్నర్ కంటే బాబర్ అవార్డుకు అర్హుడు అని ట్విటర్ వేదికగా అక్తర్ పేర్కొన్నాడు. అయితే షోయబ్ అభిప్రాయానికి విరుద్ధంగా పాకిస్థాన్‌కు చెందిన మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ స్పందించాడు.
"టోర్నీలో బాబర్ ఎక్కువ పరుగులు చేశాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎంపిక కోసం అత్యధిక పరుగులనే కాకుండా ఇతర అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. బ్యాటర్ చేసిన పరుగులు ప్రభావం జట్టు విజయావకాశాలపై ఎలా ఉన్నాయనే దానిని పరిశీలించింది. డేవిడ్ వార్నర్ చాలా కీలకమైన మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అందువల్లే ఆసీస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది" అని వివరించాడు.
- 68*, 9, 51, 70, 66, 39.. ఈ టోర్నీలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన పరుగులు.. ఆరు మ్యాచుల్లో 126.25 స్ట్రైక్‌రేట్‌తో 303 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో బాబర్ అజామ్ వ్యక్తిగతంగా మూడో టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ 319 పరుగులు (2014), దిల్షాన్ 317 పరుగులు (2009) ముందున్నారు.
- 14, 65, 1, 18, 89*, 49, 53.. కీలకమైన మ్యాచుల్లో తన సత్తా చాటిన ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గణాంకాలు ఇవి. ఏడు మ్యాచుల్లో 146.70 స్ట్రైక్‌రేట్‌తో 289 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: