ETV Bharat / sports

'పాక్​ జట్టు నిరాశలో ఉంది.. అలాంటి మాటలు సరికాదు'

author img

By

Published : Nov 13, 2021, 9:51 AM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) సెమీఫైనల్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది పాకిస్థాన్(pak vs aus t20). అయితే ఈ మ్యాచ్​లో వేడ్ క్యాచ్ మిస్ చేసిన కారణంగా హసన్ అలీపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్(wasim akram news).. ఇప్పటికే పాక్‌ జట్టు తీవ్ర నిరాశలో ఉందని.. హసన్‌ను విమర్శిస్తూ అగ్నికి ఆజ్యం పోయొద్దని ప్రజలను కోరారు.

Wasim Akram
వసీమ్ అక్రమ్

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021) సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌(pak vs aus t20) ఓటమికి ఆ జట్టు ఆటగాడు హసన్‌ అలీ(hasan ali dropped catch)నే కారణమంటూ పాక్‌ క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఆసీస్‌ బ్యాటర్‌ వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకొని ఉంటే.. పాక్‌ మ్యాచ్‌ గెలిచేదని, బంతిని వదిలేసి తప్పు చేశాడంటూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందిస్తూ హసన్‌ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌(wasim akram news) స్పందించారు. ఇప్పటికే పాక్‌ జట్టు తీవ్ర నిరాశతో ఉందని.. హసన్‌ను విమర్శిస్తూ అగ్నికి ఆజ్యం పోయొద్దని ప్రజలను కోరారు.

"ప్రస్తుత పరిస్థితి(మ్యాచ్‌ ఓటమిని ఉద్దేశించి) క్రికెటర్లకు, అభిమానులకు కష్టతరమైందే. ఆట ముగియగానే.. నిరాశతో ఆటగాళ్లంతా వారి గదుల్లోకి వెళ్లి బాధపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. మ్యాచ్‌ ఓటమి వారిని వెంటాడుతుంటుంది. అలాంటప్పుడు దేశ ప్రజలమైన మనం.. అగ్నికి ఆజ్యం పోసినట్లు వారిని బాధపెట్టకూడదు. ఇప్పుడు ప్రజలంతా హసన్‌ అలీ(hasan ali dropped catch)ని నిందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేను, వకార్ యూనిస్ చాలా ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లో అయితే, ఇది కేవలం ఒక ఆట మాత్రమే. మరుసటి రోజు బాగా ప్రయత్నించారు.. ఇది దురదృష్టకరం అని ఊరుకుంటారు" అని వసీమ్‌ అక్రమ్‌(wasim akram news) అన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌(pak vs aus t20) ఓడిపోయింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా సాగిన ఈ మ్యాచ్‌.. చివర్లో వేడ్‌ మెరుపు ఇన్నింగ్‌ ఆడటం వల్ల ఆసీస్‌ వశమైంది. దీంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఆ దేశ జట్టు ఆటగాడు హసన్‌ అలీ(hasan ali dropped catch)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. త్వరలో ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.