న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా(ind vs nz t20) ఓటమిపాలవ్వడంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా బ్యాట్ ఝుళిపించలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడమే ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోవడం వల్ల టీమ్‌ఇండియా సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ కోహ్లీ(virat kohli news).. తనకే ఆశ్చర్యంగా ఉందన్నాడు. తాము బ్యాట్‌తో కానీ, బంతితో కానీ తెగించి ఆడలేకపోయామని చెప్పాడు.
"చాలా ఆశ్చర్యంగా ఉంది. మేం బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. ధాటిగా ఆడటానికి పెద్దగా అవకాశమే లేకపోయింది. న్యూజిలాండ్ జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగింది. వికెట్ పడిన ప్రతిసారీ మేం రిస్క్ తీసుకున్నాం. షాట్లు ఆడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన నేపథ్యంలోనే ఇలా జరిగింది. అలాగే మేం రక్షించుకునేంత స్కోరు చేయలేకపోయినా.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని గమనిస్తుంటారు. తీవ్రఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దాన్ని అధిగమించాలి. రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. అందుకే మేం గెలవలేకపోయాం. ఇకపై సానుకూలంగా ఆలోచిస్తూ ఆశావాహ దృక్పథంతో ఉండాలి. ఈ ఒత్తిడిని పక్కనపెట్టి మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం" అని కోహ్లీ(virat kohli news) అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(kane williamson latest news) మాట్లాడుతూ.. సరైన ప్రణాళికలతో బరిలో దిగి విజయవంతమయ్యామని తెలిపాడు. "సరైన ప్రణాళికతో బరిలోకి దిగాం. భారత్ లాంటి అత్యుత్తమ జట్టుపై గెలవడం సంతోషంగా ఉంది. వారిపై ఒత్తిడి పెంచి గెలవాలనుకున్నాం. అదే చేశాం. ఇది సమష్టి విజయం. ఇష్ సోధి చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతడు ఎన్నోసార్లు జట్టును గెలిపించాడు" అని పేర్కొన్నాడు విలియమ్సన్(kane williamson latest news) .
ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ (23), జడేజా (26) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో 14.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది కివీస్. మిచెల్ 49 పరుగులతో తృటిలో అర్ధశతకం చేజార్చుకోగా.. విలియమ్సన్ (33*) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
'భారత్‌కు శనిలా తగిలావు'.. అంపైర్‌పై ట్రోల్స్