టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకూ (IND Vs NZ) చావో రేవో లాంటిదే. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై టీమ్ఇండియా అన్ని మ్యాచ్‌లూ గెలవాలి. అయితే.. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాపై కివీస్‌కు ఎదురులేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే భారత్ ముందు ఓ మంచి ఉపాయం ఉంది. అదే.. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్‌ను గుర్తుచేసుకోవడం.
టీమ్ఇండియా:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, షమి, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
న్యూజిలాండ్:
మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డేవన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
ఇదీ చదవండి: