2021 టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా (T20 World Cup 2021) ఎగరేసుకుపోయింది. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి పొట్టి కప్పును ముద్దాడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (T20 World Cup 2021) నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85; 48 బంతుల్లో 10x4, 3x6) కళాత్మక ఇన్నింగ్స్ ఆడటం వల్ల కివీస్ మంచి స్కోరే సాధించింది.
కానీ, ఛేదనలో రెచ్చిపోయిన ఆస్ట్రేలియా (T20 World Cup 2021) టాప్ ఆర్డర్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని 'ఉఫ్'మని ఊదేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (5) విఫలమైనా డేవిడ్ వార్నర్ (53; 38 బంతుల్లో 4x4, 3x6), మిచెల్ మార్ష్ (77; 50 బంతుల్లో 6x4, 4x6) దంచికొట్టడం వల్ల సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ తుదిపోరు ఎలా సాగిందో మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : కంగారూ గూటికి చిట్టి ప్రపంచకప్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?