ETV Bharat / sports

IND vs SCO T20: స్కాట్లాండ్​తో మ్యాచ్​.. నమోదైన రికార్డులివే! - భారత్-స్కాట్లాండ్ రికార్డులు

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). ఈ క్రమంలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

T20 world cup
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Nov 6, 2021, 10:12 AM IST

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో భాగంగా శుక్రవారం రాత్రి స్కాట్లాండ్‌(ind vs sco t20)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (50; 19 బంతుల్లో 6x4, 3x6), రోహిత్‌ శర్మ (30; 16 బంతుల్లో 5x4, 1x6) దంచికొట్టడం వల్ల టీమ్‌ఇండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్రమంలోనే పలు రికార్డులూ నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

టీ20ల్లో ఎక్కువ బంతులు మిగిలి ఉండగా టీమ్‌ఇండియా విజయాలు..

  • దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 81 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
  • 2016లో మీర్పూర్‌ వేదికగా యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 59 బంతులు మిగిలుండగా విజయం నమోదు చేసింది.
  • 2016లోనే హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతులు మిగిలుండగా గెలిచింది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఎక్కువ బంతులు మిగిలుండగా విజయాలు సాధించిన జట్లు

  • 2014లో చిట్టగాంగ్‌ వేదికగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
  • ప్రస్తుత ప్రపంచకప్‌లోనే దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడిన ఆస్ట్రేలియా 82 బంతులు మిగులుండగా విజయం దక్కించుకుంది.
  • ఇక తాజా మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్కాట్లాండ్‌పై 81 బంతులు మిగులుండగా విజయం సాధించింది.
  • 2021లోనే షార్జా వేదికగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 77 బంతులు మిగులుండగా గెలిచింది.
  • 2007లో డర్బన్‌ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 74 బంతులు మిగులుండగా విజయం.
  • 2021లో దుబాయ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 70 బంతులు మిగులుండగా విజయం.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్లు..

  • 2014లో సైలెట్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ పవర్‌ప్లేలో సాధించిన అత్యధిక స్కోర్‌ 91/1.
  • 2016లో ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పవర్‌ప్లే స్కోర్‌ 89/3. ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కూడా పవర్‌ప్లేలో 83/0తో నిలిచింది.
  • 2009లో ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్‌లో వెస్టిండీస పవర్‌ప్లే స్కోర్‌ 83/0.
  • 2021లో దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పవర్‌ప్లే స్కోర్‌ 82/2.

టీ20 పవర్‌ప్లేలో టీమ్‌ఇండియా అత్యధిక స్కోర్లు..

  • గతరాత్రి దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌పైనే టీమ్‌ఇండియా అత్యధిక స్కోర్‌ 82/2.
  • 2018లో జోహెనస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్కోర్‌ 78/2.
  • 2009లో నాగ్‌పూర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 77/1.
  • 2007లో జోహెనస్‌బర్గ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో 76/1.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాలు..

  • 2007లో డర్బన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ 12 బంతుల్లో అర్ధశతకం.
  • 2014లో సైలెట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెదర్‌లాండ్స్‌ బ్యాట్సమన్‌ స్టీఫన్‌ మైబర్గ్‌ 17 బంతుల్లో అర్ధశతకం.
  • 2014లో మీర్పూర్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌మాక్స్‌వెల్‌ 18 బంతుల్లో అర్ధశతకం.
  • 2021లో దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 18 బంతుల్లో అర్ధశతకం.

ఇవీ చూడండి: అతియాతో ప్రేమ వ్యవహారం.. రాహుల్ చెప్పేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.