ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ఫైనల్ ఆదివారం జరగనుంది. టోర్నీలో ఇప్పటి వరకు అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఈ రెండు జట్లు (Aus vs Nz Final) టైటిల్‌ను తొలిసారి దక్కించుకోవడం కోసం హోరాహోరీకి సిద్ధమయ్యాయి. వరల్డ్ కప్ గెలవడం సహా రూ.11.89 కోట్ల భారీ ప్రైజ్ మనీ (T20 World Cup Prize Money) కూడా దక్కించుకోనున్నాయి.
టీమ్ఇండియాకు కూడా..
టైటిల్ ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ఇండియా (Team India News).. సూపర్ 12 స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2012 నుంచి ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు.. నాకౌట్ దశ కూడా చేరుకోకపోవడం ఇదే తొలిసారి. అయితే టోర్నీ మొదట్లోనే నిష్క్రమించిన జట్లకు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ అందించనుంది. అందుకోసం రూ.41.63 కోట్లను పక్కకు పెట్టింది.
సూపర్ 12 దశలో పాల్గొన్నందుకు కోహ్లీ సేనకు (Team India T20 World Cup 2021) రూ.52 లక్షలు లభించనుంది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రూ.29.73 లక్షలు ఇవ్వనున్నట్లు ఐసీసీ ముందే ప్రకటించింది. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై గెలిచిన టీమ్ఇండియా.. మొత్తంగా రూ.1.41 కోట్ల ప్రైజ్‌మనీ (రూ.52 లక్షలు కలిపి) దక్కించుకోనుంది.
అనంతరం.. కివీస్‌తో ఢీ
టీ20 ప్రపంచకప్ అనంతరం.. స్వదేశంలో టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో (New Zealand Tour of India) పాల్గొననుంది. నవంబర్ 17 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. పుజారా అతడికి డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సిరీస్ నుంచి రోహిత్, బుమ్రా, షమీ, పంత్‌కు విశ్రాంతినిచ్చారు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగివచ్చి జట్టుకు సారథ్యం వహిస్తాడని బీసీసీఐ తెలిపింది.
టెస్టు జట్టు
రహానే (కెప్టెన్), పుజారా, రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా, భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్(టెస్టు జట్టు):
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్
భారత్-న్యూజిలాండ్ షెడ్యూల్
మొదటి టీ20 - నవంబరు 17, జైపుర్
రెండో టీ20 - నవంబరు 19, రాంచి
మూడో టీ20 - నవంబరు 21, కోల్‌కతా
మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్
రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబయి
ఇదీ చూడండి: AUS vs NZ Final: ఫైనల్లో సరైనోళ్లే.. ఎవరు గెలిచినా చరిత్రే!