ETV Bharat / sports

T20 World Cup: లంక ఘన విజయం.. విండీస్​ ఇంటికే!

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) వెస్టిండీస్​తో మ్యాచ్​లో శ్రీలంక చెలరేగిపోయింది. విండీస్​పై (SL Vs WI) 20 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది.

T20 World Cup
టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Nov 4, 2021, 11:25 PM IST

Updated : Nov 4, 2021, 11:52 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) సెమీస్​కు ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్​ మ్యాచ్​లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై (SL Vs WI) 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్​ సెమీస్​ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్​మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. చరిత్‌ అసలంక (68:8 ఫోర్లు, ఒక సిక్స్), నిస్సాంక (51: ఐదు ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కుశాల్‌ పెరీరా (29: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌), డాసెన్ శనక (25*: రెండు ఫోర్‌, ఒక సిక్స్‌) రాణించారు. కీలకమైన మ్యాచ్‌లో లంకపై వెస్టిండీస్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌ 2, బ్రావో ఒక వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: బంగ్లాపై ఆస్ట్రేలియా ఘన విజయం.. సెమీస్​కు మరింత చేరువగా

Last Updated : Nov 4, 2021, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.