ETV Bharat / sports

వార్నర్​కు 'ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నీ'..​ షోయబ్​ అసంతృప్తి - ప్రపంచ టీ20

టీ20 ప్రపంచకప్​లో ఆసీస్​ ఆటగాడు డేవిడ్​ వార్నర్​కు ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ అవార్డు దక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్. ఆ అవార్జు బాబర్​ అజామ్​కు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు.

shoiab aktar
షోయబ్​ అసంతృప్తి
author img

By

Published : Nov 15, 2021, 2:39 PM IST

టీ20 ప్రపంచకప్​ 'ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్'​ అవార్డును ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్​ వార్నర్​కు ఇవ్వడంపై పాకిస్థాన్​ దిగ్గజ బౌలర్​, మాజీ ఆటగాడు షోయబ్​ అక్తర్​ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ అవార్డు పాక్​ బ్యాటర్​ బాబర్​ అజామ్​కు దక్కుతుందని భావించానని అన్నాడు. ఈ మేరకు ఆదివారం ట్వీట్​ చేశాడు. వార్నర్​కు 'ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్' అవార్డు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించాడు.

ఈ టోర్నీలో పాక్​ ఆటగాడు బాబర్​ అజామ్​ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయగా.. వార్నర్​ 7 మ్యాచుల్లో 289 పరుగులు చేశాడు.

  • Was really looking forward to see @babarazam258 becoming Man of the Tournament. Unfair decision for sure.

    — Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జంపాకు రావాల్సింది..

ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ వార్నర్​కు దక్కడంపై ఆసీస్​ కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు బౌలర్​ ఆడమ్​ జంపాకు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. జంపా.. కీలక మ్యాచ్​లలో ప్రత్యర్థులకు పరుగులు చేయకుండా కట్టడి చేశాడని పేర్కొన్నాడు. ఆడమ్​ జంపా.. మొత్తం టోర్నీలో 13 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి : టీ20 ప్రపంచకప్ 2021లో నమోదైన రికార్డులివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.