ETV Bharat / sports

రెండు మ్యాచ్​ల్లో అందుకే ఓడిపోయాం: రోహిత్ - రోహిత్ శర్మ న్యూస్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా తొలి రెండు మ్యాచ్​ల్లో భారత జట్టు ఘోర వైఫల్యానికి కారణం ఏంటో వివరించాడు ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma News). రెండు ఓటములతోనే టీమ్​ఇండియా బలహీనమైన జట్టుగా మారదని అన్నాడు. మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid Coach) టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికవ్వడంపై రోహిత్‌ హర్షం వ్యక్తం చేశాడు.

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Nov 4, 2021, 1:08 PM IST

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఫామ్‌లోకి వచ్చారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో చెలరేగినట్లు బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌పై(IND vs AFG T20) దంచికొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రోహిత్‌ 'మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. కాగా, మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌(Rohit Sharma News) మీడియాతో మాట్లాడుతూ టీమ్‌ఇండియా తొలి రెండు ఓటములకు గల కారణాలు వెల్లడించాడు.

"ఇప్పుడు మేం ఆడుతున్నన్ని మ్యాచ్‌లు, అలాగే బయట ఉన్న ప్రతికూల పరిస్థితుల నడుమ కొన్నిసార్లు రాణించడం కష్టమవుతోంది. బరిలోకి దిగిన ప్రతిసారీ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసం మేం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల కొన్నిసార్లు మా నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బిజీ షెడ్యూల్‌ వల్లే ఇలా జరుగుతుంది. ఆటగాళ్లకు క్రికెట్‌ నుంచి కొంత సమయం విరామం ఉండాలి. దాంతో రిఫ్రెష్‌ అవ్వొచ్చు."

- రోహిత్ శర్మ, టీమ్​ఇండియా ఓపెనర్.

అలాగే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలు ఆడేటప్పుడు ఆటగాళ్ల ధ్యాసంతా మ్యాచ్‌పైనే ఉండాలి.. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లో తాము అదే చేయలేకపోయామని హిట్‌మ్యాన్‌ అంగీకరించాడు. అందుకే ఆ రెండు మ్యాచ్‌లు ఓటమిపాలయ్యామని చెప్పాడు. అంతమాత్రాన టీమ్‌ఇండియా బలహీనమైన టీమ్‌ కాదన్నాడు. అలా తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని తిరిగి రావడం చాలా ముఖ్యమని తెలిపాడు. ఇప్పుడు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో తాము అదే పనిచేశామని చెప్పాడు. అనంతరం టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరే విషయంపై స్పందిస్తూ.. అది తమకు చాలా దూరంగా ఉందన్నాడు. కానీ.. అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై తమ అవకాశాలు ఆధారపడ్డాయని చెప్పాడు.

నాకు తెలియదు..

చివరగా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా(Rahul Dravid Team India Coach) ఎంపికవ్వడంపై రోహిత్‌ హర్షం వ్యక్తం చేశాడు. తొలుత ఈ విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. తాము అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బిజీగా ఉన్నామని, దాని గురించి సమాచారం లేదన్నాడు. అయినా, ద్రవిడ్‌ పర్యవేక్షణలో మెరుగైన శిక్షణ పొందడానికి ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారన్నాడు. ద్రవిడ్‌ భారత జట్టులో మళ్లీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పాడు.

ఇదీ చదవండి:

IND vs AFG T20: దుమ్మురేపిన భారత్.. హైలైట్స్ చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.